ఈ మధ్యే మెగా కుటుంబంలో పెళ్లి సందడి బాగానే జరిగింది. నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. ఉదయపూర్ కోటలో రెండు రోజులు అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. అందులో మెగా కుటుంబ సభ్యులు అంతా పాల్గొన్నారు. నిహా పెళ్లికి డాన్సులతో పిచ్చెక్కించారు కూడా. అయితే అంతా బాగానే ఉన్నా ఈ పెళ్లి తర్వాత మరో పెళ్లి కూడా జరగబోతుందని.. మెగా కుటుంబంలో త్వరలోనే మళ్లీ పెళ్ళి బాజాలు మోగబోతున్నాయని వార్తలొచ్చాయి. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన సాయి.. తనకు ఇంకా టైమ్ ఉందని చెప్పాడు. అక్కడితో ఆపేస్తే బాగానే ఉండేది కానీ అల్లు శిరీష్‌ను టార్గెట్ చేసాడు మెగా మేనల్లుడు. పెళ్లెప్పుడు సాయి అంటూ తనకంటే వయసులో పెద్దోడు శిరీష్ ఉన్నాడు.. ఆయన కంటే ముందు తానెందుకు చేసుకుంటానులే అని కామెంట్ చేసాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సాయి కంటే అల్లు శిరీష్ వయసులో చిన్నోడు. కానీ తన కంటే పెద్దోడు అని చెప్పాడు సాయి తేజ్. అది విన్న తర్వాత మెగా కుటుంబంలో కూడా చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే శిరీష్ కంటే పెద్దోడైన సాయి.. చిన్నోడు అని చెప్పుకోవడం వెనక ఏంటబ్బా కథ అని ఆశ్చర్యపోయారు.

సాయి ధరమ్ తేజ్ అల్లు శిరీష్ (sai dharam tej allu shirish)
అయితే దీని వెనక కూడా ఓ కథ ఉంది. సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ పెళ్లిగోలకు బీజం నిహారిక పెళ్లిలో పడింది. ఆ పెళ్లిలో కూడా బంధువులు అంతా కూడా సాయి ధరమ్ తేజ్ కంటే ముందు అల్లు శిరీష్‌ను పెళ్లి గురించి అడుగుతూ వచ్చారు. గ్లామర్ పరంగా కూడా ఈ మధ్య చాలా మేకోవర్ అయ్యాడు శిరీష్. పక్కా ఫిజిక్‌తో ఒకప్పటితో పోలిస్తే సూపర్ లుక్‌లోకి వచ్చాడు శిరీష్. దాంతో సాయిని కాదని ఆయన కంటే చిన్నోడైన అల్లు శిరీష్‌నే పెళ్లి గురించి బంధువులు ఆరా తీయడమే, మాట్లాడితే శిరిష్ ని పొగుడుతూ ఉండటం కాస్త సాయికి జెలస్ ఫీల్ కూడా తీసుకొచ్చిందని తెలుస్తుంది. అందుకే తనను పెళ్లి గురించి అడిగిన వాళ్లకు తనకంటే పెద్దోడు శిరీష్ ఉన్నాడు అంటూ కామెంట్ చేసాడు. కానీ తనపై సాయి చేసిన కామెంట్స్ ఎంతో స్పోర్టివ్‌గా తీసుకున్నాడు అల్లు శిరీష్.
హహహ అంటూ సాయి మాటలకు జవాబిచ్చాడు శిరీష్. నా పెళ్లిపై సాయి ఏదో జోక్ చేసినట్లున్నాడు.. కానీ మీరే దాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు.. నేను సింగిల్‌గా ఉండటం నాకు చాలా సంతోషమే.. మా అమ్మానాన్నలు కూడా దీనిపై పెద్దగా ఆలోచించడం లేదు.. నాకు ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందో అప్పుడే చేసుకుంటానంటూ చురకలు అంటించాడు. మొత్తానికి తనకంటే గ్లామరస్‌గా ఉన్న శిరీష్‌ను అలా రొంపిలోకి లాగాలని చూసాడు సాయి ధరమ్ తేజ్. కానీ దాన్ని సాయి ఊహించిన దానికంటే చాలా స్పోర్టివ్‌గా తీసుకుని మనసులు గెలుచుకున్నాడు శిరీష్. ఏదేమైనా కూడా ఈ మెగా కుర్రాళ్ల పెళ్లిగోల ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం బాగానే ట్రెండ్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:December 22, 2020, 15:29 IST