2019లో రెండు విజయాలతో మళ్లీ రేసులోకి వచ్చాడు సాయి ధరమ్ తేజ్. చిత్రలహరితో పాటు ప్రతీరోజూ పండగే సినిమాలతో మళ్లీ సత్తా చూపించాడు ఈ హీరో. ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. విభిన్నమైన కథలతో తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న సాయి.. ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. కరోనా కానీ లేకపోయుంటే ఈ పాటికే సినిమా విడుదలై ఉండేది కూడా.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన నో పెళ్ళి సాంగ్ సంచలనం సృష్టించింది. ఇప్పుడు రెండో పాటను విడుదల చేసారు చిత్రయూనిట్. కొత్త దర్శకుడు సుబ్బు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ ఇందులో సాయికి జోడీగా నటిస్తుంది. అసలు పెళ్లే వద్దు.. లైఫ్ అంతా సోలోగా ఉండాల్సిందే అనుకున్న కుర్రాడి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయి అనేది అసలు కథ.
కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుబ్బు. కచ్చితంగా ఈ సినిమాతో మరో విజయం అందుకుంటానని ధీమాగా చెప్తున్నాడు సాయి. ఓటిటిలో ఈ సినిమాను విడుదల చేస్తారని టాక్ వినిపిస్తున్నా కూడా కాదు థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాతే వస్తామని చెప్తున్నారు నిర్మాతలు. మొత్తానికి విడుదలైన రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో పండగ చేసుకుంటున్నారు చిత్రయూనిట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood