సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న సాయి ధరమ్ తేజ్..

సాయి ధరమ్ తేజ్ (Twitter/Sai Dharam Tej)

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకు సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.

  • Share this:
    గతేడాది ‘చిత్రలహరి’ సినిమా వరకు సాయి ధరమ్ తేజ్ వరుసగా ఆరు ఫ్లాపులు ఇచ్చాడు. అంతేకాదు రొటీన్ సినిమాలు చేస్తాడనే పేరుండేది. అందుకే వరుసగా పరాజయాలు ఎదురైయ్యాయి.  అలాంటి పరిస్థితి నుంచి చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి. అందులో ఫెయిల్యూర్స్ గురించి చెప్పాడు. అప్పటికి సాయి తేజ్ ఉన్న కెరీర్ గ్రాఫ్‌కు ఈ కథ 100 శాతం సరిపోయింది. దాంతో ప్రేక్షకులు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోయారు. దానికితోడు చిత్రలహరితో ఓటమి గెలుపుకు తొలిమెట్టు అంటూ చూపించాడు ఈ హీరో. ఆ తర్వాత వచ్చిన మారుతి ‘ప్రతిరోజూ పండగే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా ఈ హీరో ‘సోలో బ్రతుకు సో బెటర్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు. తమన్ సంగీతం అందించిన ఈ పాట థీమ్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నో పెళ్లి అంటూ సాగే సాంగ్‌ను నితిన్ విడుదల చేసారు.

    ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ.. ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో చేస్తానన్నాడు. కొన్ని సార్లు చేసుకోవడంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో గానీ చేసుకోవడం పక్కా అంటున్నాడు. ఈ పాటలో రానా, వరుణ్ తేజ్ కూడా సందడి చేయడం విశేషం. ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేసాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: