సాయి ధరమ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన సోలో బ్రతుకే సో బెటర్ కరోనా సమయంలో కూడా థియేటర్స్‌లో విడుదలైంది. 9 నెలల తర్వాత థియేటర్స్‌లో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇదే. కరోనా నిబంధనలని పాటిస్తూ వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా చూడ్డానికి థియేటర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. తొలిరోజు 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా 3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దర్శక నిర్మాతలలో కొత్త ఉత్సాహం నింపింది. ఇప్పుడు మూడో రోజు సైతం ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. మూడో రోజు దాదాపు 3 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. దాంతో మూడు రోజుల్లో ఈ చిత్రం 10 కోట్లకు పైగా గ్రాస్.. 6 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. నభా నటేష్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ రెండో రోజు వసూళ్ల రిపోర్ట్ బయటికి వచ్చింది. కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే అదిరిపోయే వసూళ్లను సొంతం చేసుకుంటుంది ఈ చిత్రం.
మూడో రోజు కూడా భారీ వసూళ్ళు సాధించడంతో దర్శక నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 10 కోట్లు దాటడంతో బ్రేక్ ఈవెన్‌కు చేరువగా వచ్చింది ఈ చిత్రం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేవలం 8 కోట్ల మేర మాత్రమే ఈ సినిమాను అమ్మారు. ఇప్పుడు మరో రెండు మూడు రోజులు ఇవే వసూళ్లు వస్తే సినిమా సేఫ్ అవుతుంది. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైనా కూడా ముందుగానే జీ స్టూడియోస్‌కు ఔట్ రేట్‌గా అమ్మేసారు నిర్మాతలు. ఇప్పుడు థియేటర్స్‌లో వచ్చిన మొత్తం కూడా పర్సెంటేజ్ ప్రకారం పంచుకోనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Solo Brathuke So Better, Telugu Cinema, Tollywood