SAI DHARAM TEJ SOLO BRATHUKE SO BETTER 1ST DAY WORLDWIDE COLLECTIONS REPORT PK
Solo Brathuke So Better 1st day Collection: ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫస్ట్ డే కలెక్షన్స్..
సోలో బ్రతుకే సో బెటర్ సినిమా (solo brathuke so better movie)
Solo Brathuke So Better 1st day Collection: దాదాపు 9 నెలలు అయిపోయింది.. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది.. రెండో రోజు ఎన్ని కోట్లు తీసుకొచ్చింది అంటూ తెలుసుకోక. ఓటిటి పుణ్యమా అని..
దాదాపు 9 నెలలు అయిపోయింది.. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది.. రెండో రోజు ఎన్ని కోట్లు తీసుకొచ్చింది అంటూ తెలుసుకోక. ఓటిటి పుణ్యమా అని అసలు కలెక్షన్స్ మాటే లేకుండా పోయింది. 9 నెలల తర్వాత తెలుగులో విడుదలైన తొలి క్రేజీ సినిమా సోలో బ్రతుకే సో బెటర్. మార్చి తర్వాత ఇప్పటి వరకు థియేటర్స్‌లో సినిమా చూడని ప్రేక్షకుల ఆకలి తీర్చడానికి ఈ చిత్రం వచ్చింది. కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 వరకు థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలైంది. మల్టీప్లెక్సుల్లోనే ఎక్కువగా వచ్చింది సోలో బ్రతుకే. కొన్ని జిల్లాలలో ఇంకా సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ చేయలేదు. పైగా మల్టీప్లెక్సులలో కూడా కేవలం 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండాలి. అలా అన్ని కరోనా నిబంధనలు లోబడి ఈ సినిమా వచ్చింది. దాంతో మునపటి కోట్లకు కోట్లు ఫస్ట్ డే ఓపెన్ ఉంటుందనే నమ్మకాలు ఇప్పుడు ఎవరిలోనూ లేవు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు కూడా
సోలో బ్రతుకే సో బెటర్ సినిమా (solo brathuke so better movie)
తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి కోటిన్నర నుంచి 2 కోట్ల మధ్యలో షేర్ వచ్చేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది చాలా ఎక్కువ. సింగిల్ స్క్రీన్స్ లేకుండా.. సగం టికెట్స్ మాత్రమే అమ్మి 2 కోట్ల ఓపెనింగ్ అంటే చిన్న విషయం కాదు. మూమూలు టైమ్‌లో ఇదే దాదాపు 6 నుంచి 8 కోట్ల షేర్‌తో సమానం అన్నమాట.
సోలో బ్రతుకే సో బెటర్ (Solo Brathuke So Better movie)
ఫస్ట్ డే చాలా చోట్ల థియేటర్స్ ముందు ఆడియన్స్ కూడా బాగానే కనిపించారు. అయితే మునపటిలా రద్దీ మాత్రం లేదు. ఓవరాల్‌గా తొలిరోజు 40 నుంచి 50 శాతం మధ్యలో సాయి సినిమాకు ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి. మరి కరోనా సమయంలో థియేటర్స్‌కు జనం వస్తారా.. వీకెండ్‌ను సాయి ధరమ్ తేజ్ సినిమా ఎంతవరకు యూజ్ చేసుకుంటుంది అనేది చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.