Home /News /movies /

SAI DHARAM TEJ REPUBLIC PRE RELEASE EVENT OF REPUBLIC TURNS MASSIVE WITH THE PRESENCE OF PAWAN KALYAN TA

Republic Pre Release Event : సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఛీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్..

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్‌కు పవన్ కళ్యాణ్ గెస్ట్ (Twitter/Photo)

రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్‌కు పవన్ కళ్యాణ్ గెస్ట్ (Twitter/Photo)

Republic Pre Release Event : సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  Republic Pre Release Event : సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)  హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 25న నిర్వహించనున్నారు. ఈ వేడుకకు భీమ్లా నాయక్ అదేనండి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు.  పొలిటికల్ డ్రామా రిపబ్లిక్ మూవీపై  మొదటినుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్‌లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి.

  రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  విడుదల చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది రిపబ్లిక్ ట్రైలర్. అంతేకాక ఇప్పటి వరకు ఈ ట్రైలర్ 6.6 మిలియన్ వ్యూస్‌‌కు పైగా సొంతం చేసుకుంది. రిపబ్లిక్ ట్రైలర్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో నంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతూ అదరగొడుతోంది. ఇక ఈ ట్రైలర్ చూసిన నెటిజన్స్ మాత్రం తెగ పొగడుతున్నారు. ఇటు డైరెక్టర్‌ను అటు సాయి తేజ్‌ను.. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు.


  వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్' ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పోచ్చు. ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటూ ప్రస్తుత రాజకీయాలను చర్చించనున్నారని తెలుస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. వరుసగా మూడు చిత్రాల హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ హీరోగా వస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.

  Ashwini Dutt - Chiranjeevi : వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్, చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  రాజకీయ, అధికారిక, న్యాయ వ్యవస్థలకు మీడియా అనే నాలుగో వ్యవస్థ తోడుగా ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ రాజకీయం అనే వ్యవస్థ మిగిలిన అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం అన్నది ఎక్కడ వుంటుంది అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

  Kamal Haasan - Bigg Boss 5 : కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళ బిగ్‌బాస్ 5 ప్రసారానికి ముహూర్తం ఖరారు..

  అదుపుతప్పిన రాజకీయ వ్యవస్థను జ్యూడిషియరీ నియంత్రించకపోతే మరో హిట్లర్ పుడతాడు అనే డైలార్ బాగుంది. అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించనున్నారు దేవా కట్టా.

  ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటిస్తున్నారు.  మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. 'రిపబ్లిక్' ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న విడుదల చేయనున్నారు.

  Mohan Babu : మోహన్ బాబు అసలు వయసును బయటపెట్టిన ఆలీ.. మెగాస్టార్ పై కలెక్షన్ కింగ్ సంచలన వ్యాఖ్యలు..

  రిపబ్లిక్‌తో పాటు సాయి తేజ్ మరో సినిమాను చేస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు సాయి తేజ్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఈ సినిమాపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వినాయక చవితి రోజున రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్.. ఈ వేడుకకు వస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోెలుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bheemla Nayak, Deva Katta, Pawan kalyan, Republic Movie, Sai Dharam Tej

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు