Home /News /movies /

SAI DHARAM TEJ REPUBLIC MOVIE WORLD TELEVISION PREMIER JANUARY ON ZEE TELUGU TA

Sai Dharam Tej - Republic : సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు ముహూర్తం ఖరారు..

సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ (Twitter/Photo)

సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ (Twitter/Photo)

Sai Dharam Tej - Republic Digital Premier |   సాయి ధరమ్ తేజ్.. (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్‌లో వచ్చిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఇప్పటికే జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను త్వరలో రిపబ్లిక్ డే కానుకగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనునట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  Sai Dharam Tej - Republic World Television Premier :  సాయి ధరమ్ తేజ్.. (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్‌లో వచ్చిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్‌లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి. దీనికి తోడు వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న (Republic) 'రిపబ్లిక్' సినిమాపై మంచి అంచనాలున్నాయి. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించారు దేవా కట్టా.

  ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటించారు.  మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించారు. జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించింది. అయితే థియేటర్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రిపబ్లిక్.సినిమా కి ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ వచ్చినా కానీ పెద్దగా వసూలు చేయలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందు కోలేక చతికిల పడింది.

  Allu Arjun - Ala Vaikunthpurramloo : అల్లు అర్జున్.. ‘అల వైకుంఠపురములో’ హిందీ డబ్బింగ్ వెర్షన్ విడుదల తేది ఖరారు..

  బాక్స్ ఆఫీస్ దగ్గర రిపబ్లిక్ సినిమా మొత్తం మీద రూ. 6.65 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుంది.  ఈ సినిమా నవంబర్ 26 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం విశేషం.   ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది.

  NTR Death Anniversary: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తండ్రికి నివాళులు అర్పించిన బాలకృష్ణ..

  ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. రిపబ్లిక్ సినిమాను అదీ డైరెక్టర్ కామెంటరీతో సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూస్తారు. సినిమాలో సన్నివేశాల గురించి విమర్శకులు విశ్లేషిస్తారు. అయితే... తాను ఏ కోణంలో సదరు సన్నివేశం, సినిమా తీశానన్నది దర్శకుడి కామెంటరీతో సినిమా చూపిస్తే?అటువంటి ప్రయత్నానికి 'జీ 5', దర్శకుడు దేవ్ కట్టా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే డిజిటల్‌లో ఆకట్టుకున్నఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఈ నెల 23న రిపబ్లిక్ దినోత్సవం మూడు రోజుల ముందు నేతాజీ జయంతి రోజున సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు.

  Sai Dharam Tej Republic Movie World Television Premier January on Zee Telugu,Sai Dharam Tej - Republic : సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు ముహూర్తం ఖరారు..,Sai Dharam Tej - Republic,Sai Dharam Tej - Republic World Television Premier, Republic World Television Premier on 23 rd January,Republic World Digital Premier,Republic Digital Streaming Date Fixed,sai dharam tej,sai dharam tej twitter,sai dharam tej instagram,sai dharam tej republic movie,sai dharam tej republic movie on zee 5,sai dharam tej republic movie november 26th zee 5 release,telugu cinema,రిపబ్లిక్ సినిమా,సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా జీ 5 నవంబర్ 26,ఈ నెల 23న సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్
  జనవరి 23న రిపబ్లిక్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ (Twitter/Photo)


  సినిమా ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఆర్... ముగ్గురితో 'రిపబ్లిక్' విజువల్ టైమ్ లైన్ గురించి దేవ్ కట్టా డిస్కస్ చేశారు. డైరెక్టర్ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సాధారణంగా కూడా సినిమా చూడవచ్చు.

  Dhanush Aishwaryaa Divorce : నాగ చైతన్య, సమంత బాటలో విడాకులు తీసుకున్న ధనుశ్, ఐశ్యర్య దంపతులు..

  సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత చాలా రోజులు బెడ్ కే పరిమితమయ్యారు. రీసెంట్‌గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సాయి ధరమ్ తేజ్.. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకొని కోలుకున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Republic Movie, Sai Dharam Tej, Tollywood, Zee5

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు