SAI DHARAM TEJ REPUBLIC MOVIE MOTION POSTER RELEASED DIRECTED BY DEVA KATTA PK
Sai Dharam Tej Republic: సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్.. మూడు గుర్రాలాట..
రిపబ్లిక్ మోషన్ పోస్టర్ (Republic motion poster)
Sai Dharam Tej Republic: వరస విజయాలతో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరో సినిమాతో వస్తున్నాడు. ఈయన కొత్త సినిమాకు రిపబ్లిక్ అనే టైటిల్ ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. జనవరి 26, రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్..
వరస విజయాలతో దూసుకుపోతున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరో సినిమాతో వస్తున్నాడు. ఈయన కొత్త సినిమాకు రిపబ్లిక్ అనే టైటిల్ ఖరారు చేసారు దర్శక నిర్మాతలు. జనవరి 26, రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. దేవా కట్టా దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. రిపబ్లిక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సాయి వాయిస్ ఓవర్ ఈ మోషన్ పోస్టర్‌కు ప్రధానాకర్షణ. దానికితోడు గుర్రాలను చూపిస్తూ చేసిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తర్వాత దేవా కట్టా నుంచి వస్తున్న పక్కా పొలిటికల్ సినిమా ఇది. యువరానర్.. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు.. శాసనాలను అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు.. న్యాయాన్ని కాపాడే కోర్టు.. ఈ మూడు గుర్రాలు ఒకరి తప్పులు ఒకరు దిద్దుకుంటూ క్రమబద్దంగా సాగినపుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది.. ప్రభుత్వం అవుతుంది.. అదే అసలైన రిపబ్లిక్ అంటూ కోర్టు రూమ్‌లో సాయి ధరమ్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. ఈ సినిమా పూర్తిగా ప్రజాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. గత రెండేళ్లుగా సాయి వరస విజయాలు అందుకుంటున్నాడు. ఆరు ఫ్లాపుల తర్వాత 2019లో చిత్రలహరి సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన ఈయన.. అదే ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే అంటూ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా బాగానే ఆడింది. ఇప్పుడు రిపబ్లిక్ అంటూ సమ్మర్ పోటీలో ఉన్నాడు.
ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. హైలీ ఇంటెన్స్ డ్రామాగా రిపబ్లిక్ వస్తుంది. ప్రస్థానం లాంటి సినిమా తర్వాత దేవా కట్టా నుంచి ఆ రేంజ్ సినిమా రాలేదు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్‌తో అంతకంటే హై ఎమోషనల్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడు ఈయన. మరి చూడాలిక.. రిపబ్లిక్ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో..?
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.