హోమ్ /వార్తలు /సినిమా /

Sai Dharam Tej - Republic : నేటి నుంచి జీ 5లో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ స్ట్రీమింగ్..

Sai Dharam Tej - Republic : నేటి నుంచి జీ 5లో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ స్ట్రీమింగ్..

నేటి నుంచి జీ5లో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ స్ట్రీమింగ్ (Twitter/Photo)

నేటి నుంచి జీ5లో సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ స్ట్రీమింగ్ (Twitter/Photo)

Sai Dharam Tej - Republic Digital Premier |   సాయి ధరమ్ తేజ్.. (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్‌లో వచ్చిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఈ రోజు నుంచి జీ 5లో డైరెక్టర్ కామెంటరీతో..

Sai Dharam Tej - Republic Digital Premier |   సాయి ధరమ్ తేజ్.. (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్‌లో వచ్చిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఈ సినిమా  అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటినుంచి ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్‌లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి. దీనికి తోడు వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న (Republic) 'రిపబ్లిక్' సినిమాపై మంచి అంచనాలున్నాయి. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించారు దేవా కట్టా.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటించారు.  మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించారు. జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించింది. అయితే థియేటర్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రిపబ్లిక్.

బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..

సినిమా కి ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ వచ్చినా కానీ పెద్దగా వసూలు చేయలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందు కోలేక చతికిల పడింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రిపబ్లిక్ సినిమా మొత్తం మీద 10 రోజుల్లో 6.65 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నేటి నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం విశేషం.   ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది.

Kollywood Heroes In Tollywood : రజినీ,కమల్, సూర్య సహా తెలుగులో సత్తా చూపెట్టిన హీరోలు..

ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. రిపబ్లిక్ సినిమాను అదీ డైరెక్టర్ కామెంటరీతో సాధారణంగా ప్రేక్షకులు సినిమా చూస్తారు. సినిమాలో సన్నివేశాల గురించి విమర్శకులు విశ్లేషిస్తారు. అయితే... తాను ఏ కోణంలో సదరు సన్నివేశం, సినిమా తీశానన్నది దర్శకుడి కామెంటరీతో సినిమా చూపిస్తే?అటువంటి ప్రయత్నానికి 'జీ 5', దర్శకుడు దేవ్ కట్టా శ్రీకారం చుట్టారు.

Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

సినిమా ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఆర్... ముగ్గురితో 'రిపబ్లిక్' విజువల్ టైమ్ లైన్ గురించి దేవ్ కట్టా డిస్కస్ చేశారు. డైరెక్టర్ కామెంటరీతో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సాధారణంగా కూడా సినిమా చూడవచ్చు. ఈ రోజు నుంచి 'జీ 5' ఓటీటీ వేదికలో 'రిపబ్లిక్' సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..

సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత చాలా రోజులు బెడ్ కే పరిమితమయ్యారు. రీసెంట్‌గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సాయి ధరమ్ తేజ్.. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే షూటింగ్‌కు హాజరు కానున్నట్టు సమాచారం.

First published:

Tags: Deva Katta, Republic Movie, Sai Dharam Tej, Tollywood, Zee5

ఉత్తమ కథలు