Sai Dharam Tej - Republic Digital Premier | సాయి ధరమ్ తేజ్.. (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటినుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి. దీనికి తోడు వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న (Republic) 'రిపబ్లిక్' సినిమాపై మంచి అంచనాలున్నాయి. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించారు దేవా కట్టా.
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటించారు. మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించారు. జేబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. అయితే థియేటర్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రిపబ్లిక్.
బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..
సినిమా కి ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ వచ్చినా కానీ పెద్దగా వసూలు చేయలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందు కోలేక చతికిల పడింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రిపబ్లిక్ సినిమా మొత్తం మీద 10 రోజుల్లో 6.65 కోట్ల షేర్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను నవంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై అధికారికి ప్రకటన వెలుబడాల్సి ఉంది.
Chiranjeevi : చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్.. నవంబర్ 6న శుభ ముహూర్తం...
మొత్తంగా రిపబ్లిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఇక ఈ సినిమాను రూ. 12 కోట్ల రేటుకి అమ్మగా సినిమా రూ. 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. టోటల్‌గా థియేటర్ రన్ పూర్తి చేసుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర 5.64 కోట్ల లాస్‌ను సొంతం చేసుకుని.. సినిమా డిసాస్టర్‌గా నిలిచింది.
Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..
సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత చాలా రోజులు బెడ్ కే పరిమితమయ్యారు. రీసెంట్గా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సాయి ధరమ్ తేజ్.. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే షూటింగ్‌కు హాజరు కానున్నట్టు సమాచారం.
Tags: Deva Katta, Republic Movie, Sai Dharam Tej, Tollywood