Chiranjeevi Sai Dharam Tej: ఓ చిరంజీవి అభిమాని నన్ను అలా అన్నాడు.. మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్
మెగా బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినప్పటికీ.. తానేంటో నిరూపించుకునే అవకాశం సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)కి చాలా సార్లు వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఒక ఎత్తు అయితే
మెగా బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినప్పటికీ.. తానేంటో నిరూపించుకునే అవకాశం సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)కి చాలా సార్లు వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఒక ఎత్తు అయితే
Chiranjeevi Sai Dharam Tej: మెగా బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినప్పటికీ.. తానేంటో నిరూపించుకునే అవకాశం సాయి ధరమ్ తేజ్‌కి చాలా సార్లు వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఒక ఎత్తు అయితే.. ఒకానొక సమయంలో అతడిని డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్‌లు పలకరించాయి. అంతేకాదు కెరీర్ ప్రారంభంలోనూ తేజ్ చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే చిత్రలహరి నుంచి ఈ హీరో తన పంథాను మార్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కాగా కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఇటీవల తేజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మామూలుగా రేయ్‌తో ధరమ్ తేజ్ పరిచయం అవ్వాల్సి ఉండేది. కానీ నిర్మాతకు ఉన్న సమస్యలతో ఆ మూవీ ఆలస్యమైంది. ఆ తరువాత పిల్లా నువ్వు లేని జీవితంను ఒప్పుకున్నారు. అయితే ఆ మూవీ సగం షూటింగ్ అయిన తరువాత అందులో నటించిన శ్రీహరి మరణించారు. దీంతో ఆ స్థానంలో జగపతిబాబును పెట్టి మళ్లీ సినిమాను చిత్రీకరించారు. ఇలా అవ్వడంతో కొంత మంది మెగాభిమానులు అతడిని ఐరన్ లెగ్ అని చిత్రీకరించారట.
నా కెరీర్ ప్రారంభంలో ఓ చిరంజీవి అభిమాని నన్ను పిలిచి నువ్వు ఇంక సినిమాలు మానేసెయ్ అన్నారు. కానీ తానేంటో వెండితెరపై నిరూపించుకోకపోతే తానే సినిమాలను వదిలేస్తానని చెప్పా అని చెప్పుకొచ్చారు. అయితే చిరు పలు పాటలను సాయి ధరమ్ తేజ్ రీమేక్ చేయడంపై కూడా ఆ మధ్యన విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఇకపై మెగాస్టార్ పాటలను రీమేక్ చేయకూడదన్న నిర్ణయానికి ధరమ్ తేజ్ వచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి. కాగా ఈ హీరో నటించిన సోలో బతుకే సో బెటర్ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీతో హ్యాట్రిక్‌ని ఖాతాలో వేసుకుంటానని సాయి ధరమ్ తేజ్ ధీమాతో ఉన్నారు.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.