Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 4, 2019, 6:55 PM IST
ప్రతిరోజూ పండగే పోస్టర్
మారుతి అంటే ఇన్నాళ్ళూ కామెడీ సినిమాలు మాత్రమే తీసినట్లు తెలుసు. ఈయన సినిమాల్లో ఎమోషన్ కూడా ఉంటుంది కానీ మెయిన్ స్ట్రీమ్ మాత్రం ఎప్పుడూ నవ్వించడమే. తన సినిమాకు టికెట్ కొని వచ్చిన ప్రేక్షకులను రెండున్నర గంటలు నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు ఈ దర్శకుడు. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సినిమాను మాత్రం ఏడిపించాలని ఫిక్సైపోయాడు. గతేడాది నాగచైతన్యతో చేసిన శైలజా రెడ్డి అల్లుడు ఫ్లాప్ అయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఇప్పుడు సాయి సినిమాతో వస్తున్నాడు ఈ దర్శకుడు. దీనికి ప్రతిరోజూ పండగే అనే టైటిల్ కూడా పెట్టాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. సాధారణంగా తండ్రీ కొడుకుల గురించి తీయడం మన దర్శకులకు అలవాటు కానీ ఇక్కడ మాత్రం తాతా మనవళ్లపై పడ్డాడు మారుతి.
గోవిందుడు అందరివాడేలే తరహాలో ఈ చిత్రం సాగుతుందేమో అనిపిస్తుంది. కాన్సర్తో కేవలం ఐదు వారాలు మాత్రమే బతికే అవకాశం ఉన్న తాత కోరిక తీర్చడానికి మనవడు పడే తాపత్రయమే ఈ చిత్ర కథ. ఇందులో తాతగా సత్యరాజ్.. మనవడిగా సాయి తేజ్ నటించారు. సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్.. పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎప్పట్లా కామెడీతో పాటు ఎమోషనల్ ట్రై చేస్తున్నాడు మారుతి. తనపై ఉన్న ఒక్కో ముద్ర చెరిపేసుకుంటూ అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించుకునే పనిలో ఉన్నాడు ఈ దర్శకుడు. అందుకే సాయి తేజ్ సినిమాను తాతా మనవళ్ల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు.

ప్రతిరోజూ పండగే పోస్టర్ (Source: Twitter)
గీతా ఆర్ట్స్ 2 ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇందులో సుప్రీమ్ హీరోయిన్ రాశీఖన్నాతో జోడీ కడుతున్నాడు సాయి. ఏంజిల్ ఆర్నా అనే చిత్రమైన పేరుతో ఈ కారెక్టర్ సాగుతుంది. తాత చివరి రోజుల్లో ఉన్నపుడు మనవడు వచ్చి.. తను ఇప్పటి వరకు చేయాలనుకున్నవి.. చేయాలనుకుని ఆగిపోయిన పనులన్నీ చేయిస్తాడు. చివరి దశలో సంతోషంగా ఉండేలా ప్లాన్ చేస్తాడు. సత్యరాజ్ కొడుకుగా రావు రమేష్ నటిస్తున్నాడు. ఈయనతో కూడా ఫుల్ కామెడీ చేయించాడు మారుతి. సినిమాలో ఇతర కమెడియన్లతో పని లేకుండా రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్తోనే కావాల్సినంత సందడి చేయించాడు మారుతి. ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేయడంతో సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి మొదలైందిప్పుడు.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 4, 2019, 6:55 PM IST