మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి వచ్చి వరస విజయాలతో తనకంటూ ప్రత్యేక మార్కెట్ సృష్టించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ మొదట్లో కుమ్మేసిన మెగా హీరో.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా డల్ అయ్యాడు. వరసగా ఒకటి రెండు కాదు.. అరడజన్ ఫ్లాపులు ఇచ్చాడు. దాంతో సాయిని మరిచిపోతున్న తరుణంలో అదేదో మ్యాజిక్ చేసినట్లు పేరు మార్చుకోవడం.. ఈయనకు విజయం రావడం రెండూ ఒకేసారి జరిగాయి. సాయి ధరమ్ తేజ్ నుంచి ధరమ్ పీకేసి సాయి తేజ్ అని పెట్టుకున్నాడు ఈ హీరో. దాంతో చిత్రలహరితో విజయం అందుకున్నాడు. ఆ తర్వాత ప్రతీరోజూ పండగే మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ హీరో.
ఇక ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటరూ అంటూ వస్తున్నాడు. దాంతో పాటు మరో మూడు సినిమాలకు కూడా సైన్ చేసాడు సాయి. ఇదిలా ఉంటే లాక్ డౌన్ సందర్భంగా అప్పుడప్పుడూ అభిమానులతో మాట్లాడుతున్నాడు సాయి. అందులో భాగంగానే వాళ్లు అడిగి ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడు. అందులో కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఆ క్రమంలోనే తన అమ్మానాన్నల విడాకుల గురించికూడా టాపిక్ వచ్చింది. అందులో దాచుకోడానికి ఏం లేదని చాలా ఓపెన్‌గా చెప్పాడు సాయి ధరమ్ తేజ్.
తన జీవితంలో చాలా బాధ పడిన సందర్భాలలో అది కూడా ఒకటని.. కానీ వాళ్ల నిర్ణయాలు, దారులు వేరైనపుడు కలిసుండే కంటే విడిపోవడం మంచిదని చెప్పాడు ఈయన. వాళ్ల నిర్ణయానికి గౌరవం కూడా ఇవ్వాలంటున్నాడు. కొన్ని రోజులు బాధ అనిపించినా కూడా ఆ తర్వాత వాళ్లు చేసిందే రైట్ అనిపించిందని చెప్పాడు ఈయన. తాను టెన్త్ క్లాసులో ఉన్నప్పుడు తల్లి దండ్రులు విడిపోవడం బాధ కలిగించిందని తెలిపాడు సాయి. అమ్మా నాన్న మధ్య సరిపడలేదు.. విడాకులు అనివార్యమయ్యాయి.. అది చేదు జ్ఞాపకం అని చెప్పాడు.
ఏదేమైనా గతం గతః.. అది గుర్తు పెట్టుకుని చేసేదేం లేదు.. తన వరకు మాత్రం అమ్మయినా నాన్నయినా అన్నీ అమ్మే అని చెప్పాడు సాయి ధరమ్ తేజ్. తనను తమ్ముడు వైష్ణవ్ తేజ్‌ను నాన్న లోటు తెలియకుండా అమ్మ పెంచిందని చెప్పాడు సాయి. 2010లో ఈమె డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకుందని.. ఆయన చాలా మంచివారని చెప్పాడు సాయి. ప్రస్తుతం అమ్మ చాలా ఆనందంగా ఉందని.. ఆమె సంతోషం కంటే తనకు కావాల్సింది కూడా ఏం లేదని చెప్పాడు మెగా మేనల్లుడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood