చిత్రలహరి సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ కెరీర్ మళ్లీ గాడిన పడింది. ఈ సినిమాతో నాలుగేళ్ల తర్వాత విజయం అందుకున్నాడు మెగా మేనల్లుడు. అరడజన్ ఫ్లాపుల తర్వాత వచ్చిన విజయం కావడంతో జాగ్రత్తగా కాపాడుకోడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు సాయి. ప్రస్తుతం మారుతి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికే ఈ కాంబినేషన్లో సినిమా కోసం అన్నీ సిద్ధమైపోయాయి. గీతా ఆర్ట్స్ 2 ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో మారుతి తనలోని మరో కోణాన్ని పరిచయం చేయబోతున్నాడు.
ఈ రోజుల్లో, బస్టాప్ లాంటి సినిమాలతో యూత్.. ఆ తర్వాత భలేభలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి సినిమాలతో కామెడీ జోనర్స్ టచ్ చేసిన మారుతి.. ఈ సారి పూర్తిగా ఎమోషనల్ వైపు వెళ్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథలో సాయి ధరమ్ తేజ్‌ను ఒప్పించాడు మారుతి. దీనికి భోగి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. సంక్రాంతి విడుదలకు ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఒకవేళ అప్పుడు కానీ విడుదల చేస్తే భోగి అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నారు యూనిట్. అది కుదరని పక్షంలో ప్రతీరోజు పండగే అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు మారుతి. శైలజారెడ్డి అల్లుడు నిరాశ పరచడంతో మారుతికి కూడా సాయి ధరమ్ తేజ్ సినిమా కీలకంగా మారింది. మరి ఈ ఇద్దరూ కలిసి ఏం చేస్తారో చూడాలిక.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maruthi, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood