హోమ్ /వార్తలు /సినిమా /

అలరిస్తోన్న ‘చిత్రలహరి’ టీజర్.. విజయం ఎప్పుడొస్తుందోనంటున్న తేజ్

అలరిస్తోన్న ‘చిత్రలహరి’ టీజర్.. విజయం ఎప్పుడొస్తుందోనంటున్న తేజ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ చిత్రలహరి. తేజు సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ రిలీజైంది.

వరుసగా ఆరు ఫ్లాపులతో నిరాశలోకి వెళ్లిన సాయి ధరంతేజ్ ఒక్క హిట్ కొట్టాలని చూస్తున్నాడు ఈ యజ్ఞంలో భాగంగానే ప్రస్తుతం చిత్రలహరి సినిమాలో నటిస్తున్నాడు మెగా మేనల్లుడు. ఉన్నది ఒకటే జిందగీ నేను శైలజ లాంటి సినిమాల తర్వాత కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి తాజాగా చిత్రలహరి టీజర్ విడుదలైంది. డైరెక్టర్ సుకుమార్ వాయిస్‌తో రిలీజైన టీజర్ మూవీపై అంచనాలను పెంచుతోంది.

కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో సాయిధరమ్ తేజ్ చేస్తున్న మూవీ చిత్రలహరి. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా చేస్తున్న ఈ మూవీ టీజర్‌లో ఒక్కో షాట్‌‌లో ఒక్కొక్కరినీ పరిచయం చేస్తూ వారి క్యారెక్టరైజేషన్‌‌ని తెలిపే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. శ్రీమంతుడు, జనతాగ్యారెజ్, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.

లుక్ పరంగా ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు తేజ్. నిండుగా గడ్డంతో తేజ్.. నా పేరు విజయ్ అంటూ డైలాగ్ చెప్పాడు సాయిధరమ్. ఆ వెంటనే కరెంట్ పోతుంది.. టీజర్‌ని చూస్తే ఔట్ అండ్ ఔట్ కామెడీతో ఖచ్చితంగా హిట్ కొడుతుందనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా.. చివరగా విజయం ఎప్పుడొస్తుందనని తన ప్రజెంట్ సీరియస్ సిట్య్చువేషన్‌ని కామెడీగానే జోడించినట్లు తెలుస్తోంది. మరోవైపు, సునీల్ సరికొత్తగా కనిపించాడు. ఇది చూసినవారంతా సునీల్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఏప్రిల్ 12న రిలీజయ్యే చిత్రలహరి మూవీ ప్రమోషన్‌ని టీజర్ ఓ మెట్టెక్కించినట్లే అనిపిస్తోంది.


First published:

Tags: Sai Dharam Tej, Tollywood, Tollywood Cinema, Tollywood Movie News

ఉత్తమ కథలు