హోమ్ /వార్తలు /సినిమా /

Sai Dharam Tej Accident: సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి కారణమదే.. మదాపూర్ పోలీసులు.. యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఇదే..

Sai Dharam Tej Accident: సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదానికి కారణమదే.. మదాపూర్ పోలీసులు.. యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఇదే..

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది.

  మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ బైక్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తొలుత అతి వేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు స్పందించారు. మాదాపూర్ ఏసీపీ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో సాయి తేజ్‌(Sai Dharam Tej)హెల్మెట్‌ పెట్టుకున్నాడని.. మద్యం సేవించలేదని తెలిపారు. రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయిందని చెప్పారు. స్కిడ్ కావడంతో సాయిధరమ్ తేజ్ బైక్‌ను అదుపు చేయలేకపోయారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇక, శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సాయిధరమ్ తేజ్‌ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైందని మాదాపూర్ ఇంచార్జ్ డీసీపీ ఎం వెంకటేశ్వర్లు ( M Venkateshwarlu) తెలిపారు. సాయిధరమ్ తేజ్ జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.


  సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి(Apollo Hospital) డాక్టర్లు ప్రకటించారు. ఆయనకు తల, ఇతర భాగాల్లో తీవ్రమైన గాయాలు లేవని తెలిపారు. అయితే ఇలాంటి కేసుల్లో 48 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని అన్నారు. బైక్ మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా దెబ్బలు తగిలే అవకాశం ఉందని.. అందుకే 48 గంటల పాటు ఆయనను క్లోజ్‌గా మానిటర్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఆయనకు ఎలాంటి సర్జరీ చేయబోమని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారని.. ఆయన కోలుకోవాలని అంతా కోరుకుందామని తెలిపారు. యువ హీరో ఆరోగ్య పరిస్థితిపై ఉదయం 9 గంటలకు డాక్టర్లు మరోసారి బులెటిన్ విడుదల చేయనున్నారు.

  శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్(Cable Bridge) సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ బైక్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్‌ తేజ్‌ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం సాయిధరమ్ తేజ్‌ను జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు పవన్ కల్యాణ్(Pawan Kalyan), చిరంజీవి(Chiranjeevi), ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని.. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు.

  ఇక, సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారని నిర్మాత అల్లు అరవింద్‌ వెల్లడించారు. మీడియాలో వస్తున్న వార్తలు, అభిమానుల ఆందోళన నేపథ్యంలోనే.. తాము ముందుగా ఈ విషయాన్ని చెబుతున్నానని అల్లు అరవింద్ అన్నారు. ఇక, సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ బయటకు వచ్చింది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Sai Dharam Tej, Sai dharam tej accident, Tollywood news

  ఉత్తమ కథలు