SAI DHARAM TEJ HINT ABOUT ALLU SIRISH MARRIAGE MNJ
Sai Dharam Tej: త్వరలో మెగా కుటుంబంలో మరో పెళ్లి.. వెల్లడించిన సాయి ధరమ్ తేజ్
సాయి తేజ్
మెగా ఫ్యామిలీలో ఇటీవలే ఓ వివాహ వేడుక ముగిసింది. మెగా డాటర్ నిహారిక పెళ్లి, చైతన్యతో(NisChay marriage) అంగరంగవైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది
Sai Dharam Tej: మెగా ఫ్యామిలీలో ఇటీవలే ఓ వివాహ వేడుక ముగిసింది. మెగా డాటర్ నిహారిక పెళ్లి, చైతన్యతో అంగరంగవైభవంగా జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. అక్కడ వారు చేసిన హడావిడికి చెందిన ఫొటోలు, వీడియోలను చూసిన మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అటు మెగా, ఇటు అల్లు రెండు కుటుంబాలను ఒకే వేదికపైన చూసిన మెగా ఫ్యాన్స్ సంబరాలు కూడా జరుపుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వెల్లడించాడు. అయితే సాయి ధరమ్ తేజ్ చెప్పింది తన గురించి కాదు అల్లు శిరీష్ గురించి.
వచ్చే ఏడాది అల్లు శిరీష్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడట. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ధరమ్ తేజ్.. శిరీష్ నాకంటే పెద్ద. అందుకే నాకంటే ముందు తనకే పెళ్లి జరుగుతుంది. వచ్చే ఏడాదిలో పెళ్లి జరగొచ్చు అని తెలిపారు. ఇక తమ ఇంట్లో పెద్ద కొడుకుగా తనకు కొన్ని బాధ్యతలున్నాయని.. వాటిని పూర్తి చేయాలని పేర్కొన్నారు. అయితే తనకు పెళ్లి చేసుకోవడం కంటే సోలోగా ఉంటేనే ఇష్టమని ధరమ్ చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి చాలా మిస్ అయ్యా. ఎన్నో కలలున్నాయి. ముందుగా వాటని నెరవేర్చుకోవాలి’’ అని తేజ్ చెప్పుకొచ్చారు.
అయితే సాయి ధరమ్ తేజ్ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అతడి కోసం ఇంట్లో సంబంధాలు వెతకడం కూడా స్టార్ట్ చేశారని పుకార్లు నడిచాయి. అయితే ఈ విషయంపై స్పందించిన ధరమ్ తేజ్ ఇంకా వెతుక్కోలేదని అన్నారు. కానీ తన తల్లి సంతోషం కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పానని వెల్లడించారు. అమ్మలను బిజీగా పెట్టాలని, లేదంటే వాళ్లు ఏవేవో చేస్తుంటారని ఈ సందర్భంగా తల్లులపై ఫన్నీ కామెంట్ ఇచ్చారు. కాగా ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.