ఇండస్ట్రీలో సంపాదించడం అందరూ చేస్తారు. కానీ సంపాదించిన దాన్ని పంచే గుణం కూడా ఉండాలి. అలాంటి మంచి మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన కూడా ఇప్పుడు ఓ మంచి పని చేస్తున్నాడు. ఈయన తీసుకున్న నిర్ణయంతో ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ మధ్యే వరస పరాజయాలకు ముగింపు పలుకుతూ చిత్రలహరి సినిమాతో విజయం అందుకున్నాడు సాయి తేజ్. ఇక ఇప్పుడు మారుతి సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు ఈయన. ఎప్పుడు ఎవరికీ ఏ అవసరం కావాలన్నా కూడా తనవంతుగా ముందుకొస్తున్నాడు మెగా మేనల్లుడు. ఆ మధ్య ఓ వికలాంగుడికి క్రీడల్లో సాయం చేసిన ఈయన.. ఇప్పుడు మున్నిగూడలోని అక్షరాలయం స్కూల్‌ను దత్తత తీసుకున్నారు. రెండేళ్ల కిందే ఈ పాఠశాలను దత్తత తీసుకున్నాడు ఈయన. అక్కడ చదువుతున్న 100 పిల్లలకు తిండి.. చదువును అందిస్తున్నారు తన వంతుగా అందిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.
ఈ పనులను `థింక్ పీస్` అనే స్వచ్ఛంద సంస్థ నుంచి పర్యవేక్షిస్తున్నారు మెగా హీరో. రెండేళ్లుగా పిల్లల బాగోగులు చూసుకుంటున్న ఈయన మంచి మనసుకు థింక్ పీస్ సంస్థ తమ కృతజ్ఞతలను తెలిపింది. అప్పట్లో చిరంజీవి హోస్టుగా ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు వచ్చినపుడు అందులో గెలిచిన డబ్బును కూడా ఈ స్కూల్ కోసమే ఖర్చు చేసాడు సాయి. ఇప్పుడు కూడా తన సొంత డబ్బుతో ఇదంతా చేస్తున్నాడు ఈయన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood