సాయితేజ్, (Sai Dharam Tej) దేవా కట్టా (Deva Katta) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. మొదటినుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్‌లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Republic Trailer) విడుదలైంది. వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్' ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పోచ్చు. ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటూ ప్రస్తుత రాజకీయాలను చర్చించనున్నారని తెలుస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. వరుసగా మూడు చిత్రాల హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ హీరోగా వస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.
రాజకీయ, అధికారిక, న్యాయ వ్యవస్థలకు మీడియా అనే నాలుగో వ్యవస్థ తోడుగా ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ రాజకీయం అనే వ్యవస్థ మిగిలిన అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం అన్నది ఎక్కడ వుంటుంది అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
Jathi Ratnalu : జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్‌తో వెంకీ మామ కొత్త సినిమా..
అదుపుతప్పిన రాజకీయ వ్యవస్థను జ్యూడిషియరీ నియంత్రించకపోతే మరో హిట్లర్ పుడతాడు అనే డైలార్ బాగుంది. అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించనున్నారు దేవా కట్టా.
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.
Launching the trailer :https://t.co/mdA3ILcZld@IamSaiDharamTej
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2021
ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటిస్తున్నారు. మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. 'రిపబ్లిక్' ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.
Ram Charan | Shankar : ఆ ఒక్క ఫైట్ సీన్‌కు పదికోట్లు ఖర్చు చేస్తున్న శంకర్..
అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జూన్ 4న విడుదల అవ్వాల్సి ఉండేది. అయితే కరోనా దెబ్బ కొట్టింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని కొన్ని వార్తలు రాగా... అవన్ని రూమర్స్ అని తేలింది. ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలకానుంది. జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
రిపబ్లిక్‌తో పాటు సాయి తేజ్ మరో సినిమాను చేస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు సాయి తేజ్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నారు. హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకునే ఆలోచనలో ఉందట చిత్రబృందం. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.