Sai Dharam Tej | Republic Trailer : సోషల్ మీడియాలో అదరగొడుతోన్న సాయి తేజ్, దేవ కట్టా రిపబ్లిక్ ట్రైలర్..

Sai Dharam Tej in Republic Photo : Twitter

Sai Dharam Tej | Republic : సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. విడుదల చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది రిపబ్లిక్ ట్రైలర్. ఇప్పటికే ఈ ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్‌తో కేకపెట్టిస్తోంది.

  • Share this:
    సాయితేజ్,  (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. మొదటినుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్‌లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ (Republic Trailer)  విడుదలైంది. ఈ ట్రైలర్‌ను తాజాగా మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది రిపబ్లిక్ ట్రైలర్. అంతేకాక ఇప్పటి వరకు ఈ ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్‌‌కు పైగా సొంతం చేసుకుంది. రిపబ్లిక్ ట్రైలర్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో నంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతూ అదరగొడుతోంది. ఇక ఈ ట్రైలర్ చూసిన నెటిజన్స్ మాత్రం తెగ పొగడుతున్నారు. ఇటు డైరెక్టర్‌ను అటు సాయి తేజ్‌ను.. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు.

    వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్' ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పోచ్చు. ఈ సినిమా ట్రైలర్‌ను చూస్తుంటూ ప్రస్తుత రాజకీయాలను చర్చించనున్నారని తెలుస్తోంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. వరుసగా మూడు చిత్రాల హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ హీరోగా వస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి.

    రాజకీయ, అధికారిక, న్యాయ వ్యవస్థలకు మీడియా అనే నాలుగో వ్యవస్థ తోడుగా ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ రాజకీయం అనే వ్యవస్థ మిగిలిన అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం అన్నది ఎక్కడ వుంటుంది అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

    Kamal Haasan - Bigg Boss 5 : కమల్ హాసన్ హోస్ట్‌గా తమిళ బిగ్‌బాస్ 5 ప్రసారానికి ముహూర్తం ఖరారు..

    అదుపుతప్పిన రాజకీయ వ్యవస్థను జ్యూడిషియరీ నియంత్రించకపోతే మరో హిట్లర్ పుడతాడు అనే డైలార్ బాగుంది. అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది కలెక్టర్ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించనున్నారు దేవా కట్టా.


    ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటిస్తున్నారు.  మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. 'రిపబ్లిక్' ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

    Mohan Babu : మోహన్ బాబు అసలు వయసును బయటపెట్టిన ఆలీ.. మెగాస్టార్ పై కలెక్షన్ కింగ్ సంచలన వ్యాఖ్యలు..

    అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా జూన్ 4న విడుదల అవ్వాల్సి ఉండేది. అయితే కరోనా దెబ్బ కొట్టింది. దీంతో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని కొన్ని వార్తలు రాగా... అవన్ని రూమర్స్ అని తేలింది. ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలకానుంది. జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

    రిపబ్లిక్‌తో పాటు సాయి తేజ్ మరో సినిమాను చేస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నారు సాయి తేజ్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నారు. ఈ సినిమాపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
    Published by:Suresh Rachamalla
    First published: