Home /News /movies /

SAI DHARAM TEJ DEVA KATTA REPUBLIC MOVIE RELEASE DATE CONFIRMED OFFICIALLY SR

Sai Dharam Tej : సుప్రీం హీరో సాయితేజ్ దేవాకట్టా రిపబ్లిక్ రిలీజ్ డేట్‌ ఫిక్స్..

Sai Tej Republic release date Photo : Twitter

Sai Tej Republic release date Photo : Twitter

Sai Tej : లవ్ స్టోరీస్‌ను పక్కన పెట్టి దేవాకట్టా దర్శకత్వంలో మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్'.

    లవ్ స్టోరీస్‌ను పక్కన పెట్టి దేవాకట్టా దర్శకత్వంలో మెగా హీరో సాయితేజ్ నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్'. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తర్వాత సాయితేజ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ 'రిపబ్లిక్' ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు భగవాన్, పుల్లారావులు ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం రిపబ్లిక్ సినిమా షూటింగ్ జరుతోందని పేర్కొన్న ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, రమ్యకృష్ణ, జగపతి బాబు తదితరులు కూడా నటిస్తున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో వస్తోన్న ఈ 'రిపబ్లిక్'కు మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత దేవా క‌ట్టా నుంచి వస్తున్న పక్కా పొలిటికల్ సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి. గత రెండేళ్లుగా సాయి వరస విజయాలు అందుకుంటున్నాడు. ఆరు ఫ్లాపుల తర్వాత 2019లో చిత్రలహరి సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన ఈయన.. అదే ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే అంటూ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా బాగానే ఆడింది. ఇప్పుడు రిపబ్లిక్‌తో వస్తున్నాడు. చూడాలి ఈ సినిమా ఎలా ఆకట్టుకోనుందో.. సాయి తేజ్ ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా ఓకే చేశాడు.








    కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు సాయితేజ్. స్టార్ డైరక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లేతో వస్తున్న ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి హీరోయిన్ గా కీర్తిసురేష్ ను తీసుకునే ఆలోచనలో ఉంది చిత్రబృందం. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో నితిన్ రంగ్ దే సినిమాను చేస్తుంది. ఈ సినిమాతో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాతో పాటు కీర్తి చిరంజీవి తమిళ రీమేక్ వేదాళంలో కూడా నటించనుంది. ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Sai Dharam Tej, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు