Sai Dharam Tej | Republic : రిపబ్లిక్ కలెక్షన్స్.. థియేటర్ రన్ కంప్లీట్... ఎన్ని కోట్ల లాస్ అంటే..

Sai Dharam Tej in Republic Photo : Twitter

Sai Dharam Tej | Republic : సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలై 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. థియేటర్ రన్ పూర్తి చేసుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర 5.64 కోట్ల లాస్‌ను సొంతం చేసుకుని.. సినిమా డిసాస్టర్‌గా నిలిచింది.

  • Share this:
    సాయితేజ్,  (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్‌లో వచ్చిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటినుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్‌లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి. దీనికి తోడు వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న (Republic) 'రిపబ్లిక్' సినిమాపై మంచి అంచనాలున్నాయి. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించారు దేవా కట్టా.

    ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటించారు.  మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించారు. జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించింది. అయితే థియేటర్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రిపబ్లిక్.

    Naga Shaurya : ఆకట్టుకుంటోన్న నాగశౌర్య వరుడు కావలెను ట్రైలర్.. ఫ్యామిలీ ఆడియెన్సే టార్గెట్..

    సినిమా కి ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ వచ్చినా కానీ పెద్దగా వసూలు చేయలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందు కోలేక చతికిల పడింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రిపబ్లిక్ సినిమా మొత్తం మీద 10 రోజుల్లో 6.65 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుంది.

    Chiranjeevi : చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్.. నవంబర్ 6న శుభ ముహూర్తం...

    ఇక ఆ తర్వాత అసలే పడిపోయి మరో 21 లక్షల మేర కలెక్షన్స్ ని మొత్తం మీద సొంతం చేసుకుంది. సినిమా కంటెంట్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ ఆడియన్స్ అంచనాలు వేరేగా ఉండటంతో సినిమా బిజినెస్‌ను అందుకోలేక లాస్‌ను సొంతం చేసుకుంది.

    రిపబ్లిక్ సినిమా సాధించిన మొత్తం కలెక్షన్స్..

    Nizam: 1.97Cr
    Ceeded: 1.16Cr
    UA: 79L
    East: 45L
    West: 43L
    Guntur: 47L
    Krishna: 46L
    Nellore: 31L
    AP-TG Total:- 6.04CR(10.05CR Gross)
    Ka+ROI: 33L
    OS – 49L
    Total WW: 6.86CR(12.65CR~ Gross)
    రిపబ్లిక్ సినిమా (Republic world wide collections) మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఇక ఈ సినిమాను 12 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. టోటల్‌గా థియేటర్ రన్ పూర్తి చేసుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర 5.64 కోట్ల లాస్‌ను సొంతం చేసుకుని.. సినిమా డిసాస్టర్‌గా నిలిచింది.
    Published by:Suresh Rachamalla
    First published: