Sai Dharam Tej | Republic Twitter Review : సాయి తేజ్, దేవ కట్టా రిపబ్లిక్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Sai Dharam Tej in Republic Photo : Twitter

Sai Dharam Tej | Republic : సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా దేవకట్టా దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అవేంటో చూద్దాం..

  • Share this:
    సాయితేజ్,  (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే మొదటినుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్‌లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి. ఇక ఇటీవల ఈ సినిమా ట్రైలర్ (Republic Trailer)  విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. విడుదల చేసిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది రిపబ్లిక్ ట్రైలర్. అంతేకాక ఇప్పటి వరకు ఈ ట్రైలర్ 4 మిలియన్ వ్యూస్‌‌కు పైగా సొంతం చేసుకుని అదరగొట్టింది.

    ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ అమెరికా లాంటీ దేశాల్లో ఇప్పటికే పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు ఈ పోలిటికల్ డ్రామా తెలుగు వారిని ఆకట్టుకోలదు వంటి అంశాలను చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం...

















    వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న 'రిపబ్లిక్' సినిమాపై మంచి అంచనాలున్నాయి. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. రాజకీయ, అధికారిక, న్యాయ వ్యవస్థలకు మీడియా అనే నాలుగో వ్యవస్థ తోడుగా ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ రాజకీయం అనే వ్యవస్థ మిగిలిన అన్ని వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టేసుకుంటే ఇక ప్రజాస్వామ్యం అన్నది ఎక్కడ వుంటుంది అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

    జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించనున్నారు దేవా కట్టా. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటిస్తున్నారు.  మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: