SAI DHARAM TEJ DEV KATTA REPUBLIC TO STREAM ON ZEE 5 AN AUDIO MESSAGE BY SAI DHARAM TEJ GOES VIRAL SR
Sai Dharam Tej: ప్రమాదం తర్వాత మొదటిసారి స్పందించిన సాయితేజ్.. ఆడియో క్లిప్ వైరల్..
Sai Dharam Tej Photo : Twitter
Sai Dharam Tej | Republic : హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి కొలుకున్న తర్వాత మొదటిసారి స్పందిస్తూ ఓ ఆడియో మెసేజ్ పంపించారు. తాను ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మీరు చూపించిన ప్రేమ, కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ తన ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు.
సాయితేజ్, (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్లో వచ్చిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటినుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి. దీనికి తోడు వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న (Republic) 'రిపబ్లిక్' సినిమాపై మంచి అంచనాలున్నాయి. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించారు దేవా కట్టా.
ఇక థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. దీంతో ఈ సినిమా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి కొలుకున్న తర్వాత మొదటిసారి స్పందిస్తూ ఓ ఆడియో మెసేజ్ పంపించారు. తాను ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మీరు చూపించిన ప్రేమ, కురిపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ తన ఆడియో క్లిప్‌లో పేర్కొన్నారు. రిపబ్లిక్ సినిమాను థియేటర్లో మీతో కలిసి చూడలేకపోయానని, కానీ ఆ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదల అవుతోందని.. ఈ సినిమాను చూసి స్పందించాలని కోరారు. సాయితేజ్‌కు సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో పక్కటెముకలు విరగడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
Supreme Hero @IamSaiDharamTej ’s first personal AUDIO NOTE thanking all the fans and media for their love, support & prayers.
ఇక రిపబ్లిక్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటించారు. మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించారు. జేబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. అయితే థియేటర్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రిపబ్లిక్.
The fight against the system never ends!#Republic, premieres November 26, only on #ZEE5.
సినిమా కి ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ వచ్చినా కానీ పెద్దగా వసూలు చేయలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందు కోలేక చతికిల పడింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రిపబ్లిక్ సినిమా మొత్తం మీద 10 రోజుల్లో 6.65 కోట్ల షేర్ని సొంతం చేసుకుంది.
సినిమా కంటెంట్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ ఆడియన్స్ అంచనాలు వేరేగా ఉండటంతో సినిమా బిజినెస్‌ను అందుకోలేక లాస్‌ను సొంతం చేసుకుంది. రిపబ్లిక్ సినిమా (Republic world wide collections) మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఇక ఈ సినిమాను 12 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. టోటల్‌గా థియేటర్ రన్ పూర్తి చేసుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర 5.64 కోట్ల లాస్‌ను సొంతం చేసుకుని.. సినిమా డిసాస్టర్‌గా నిలిచింది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.