హోమ్ /వార్తలు /సినిమా /

వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.. ఆ సత్తా ఆయనకే సొంతం! సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్

వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్.. ఆ సత్తా ఆయనకే సొంతం! సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్

Pawan Kalyan Sai tej (Photo Twitter)

Pawan Kalyan Sai tej (Photo Twitter)

Sai Dharam Tej: వైష్ణవ్ తేజ్, సాయి తేజ్, వరుణ్ తేజ్ లను యాంకర్ సుమ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు సాధించగా.. తమదైన స్టైల్లో సమాధానాలు చెప్పి మెప్పించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి సాయి తేజ్ కామెంట్స్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అప్పట్లో వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖుషి (Kushi) సినిమాను సగటు ప్రేక్షకుడు అస్సలు మరవలేడు. ఆ సమయంలో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తూ సూపర్ డూపర్ హిట్ సాధించింది ఖుషీ మూవీ. నిర్మాతలకు లాభాల పంట పండించడమే గాక నటీనటులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా రీమేక్ చేయాల్సి వస్తే ఏ హీరో అయితే బాగుంటుందనే కోణంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయమై సింగిల్ లైన్ స్టేట్‌మెంట్ ఇచ్చి మెగా అభిమానులను ఖుషీ చేశారు సాయి తేజ్.
తన తమ్ముడు, మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా రంగ రంగ వైభవంగా (Ranga Ranga Vaibhavanga). ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‏లో ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ముఖ్య అతిథిలుగా విచ్చేసి సందడి చేశారు. వేదికపై సాయి తేజ్, వరుణ్ తేజ్ ఇచ్చిన స్పీచ్ మెగా అభిమానులందరినీ ఫిదా చేసింది.


అదేవిధంగా ఈ ముగ్గురు మెగా హీరోలకు (వైష్ణవ్ తేజ్, సాయి తేజ్, వరుణ్ తేజ్) యాంకర్ సుమ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు సాధించగా.. తమదైన స్టైల్లో సమాధానాలు చెప్పి మెప్పించారు ఈ హీరోలు. అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాను ప్రస్తుతం మీలో ఎవరు రీమేక్ చేస్తే సెట్ అవుతారు అని సుమ ప్రశ్నించగా.. సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అవుతూ ఓపెన్ అయ్యారు. ఆ రోల్ చేయగలిగిన హీరో వన్ అండ్ ఓన్లీ అనేశారు సాయి తేజ్. ఆ సత్తా ఆయనకు మాత్రమే ఉందని అన్నారు.
వైష్ణవ తేజ్ మూడో సినిమాగా ఈ రంగ రంగ వైభవంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో డైరెక్టర్ గిరీశాయ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. చిత్రంలో వైష్ణవ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్స్, వీడియోస్ భారీ రెస్పాన్స్ అందుకున్నాయి. సెప్టెంబర్ 2న ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీపై మెగా అభిమాన లోకం అంచనాలు పెట్టుకుంది. ఇది సక్సెస్ అయితే వైష్ణవ తేజ్ కెరీర్ టర్న్ అవుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Pawan kalyan, Sai Dharam Tej, Vaishnav tej

ఉత్తమ కథలు