HBD Sai Tej : పుట్టినరోజున కొత్త పోస్టర్‌.. స్టైలీష్ లుక్‌లో సాయి తేజ్

Twitter/GeethaArts

#HBDSaiTej : సాయి తేజ్ ఈరోజు 33వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా 'ప్రతిరోజూ పండగే' చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

  • Share this:
    #HBDSaiTej : సాయి తేజ్.. వరుస ప్లాప్ సినిమాల తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆ మధ్య వచ్చిన ‘చిత్ర‌ల‌హ‌రి’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఆయన తాజాగా మారుతి డైరెక్షన్‌లో ‘ప్రతిరోజూ పండగే’  అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో  సాయి తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ ఆ మధ్య విడుదలై మంచి స్పందనను పొందింది. తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్‌ టచ్ చేస్తూ ఈ సినిమా ఉండబోతుందని ఈ పోస్టర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. తండ్రిగా సత్యరాజ్ కనిపిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్ని వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.


    అది అలా ఉంటే సాయి ఈరోజు 33వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా 'ప్రతిరోజూ పండగే' చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో సాయి తేజ్ స్టైలీష్ లుక్‌లో ఓ సూట్ కేస్ పట్టుకుని అదరగొట్టాడు.
    Published by:Suresh Rachamalla
    First published: