హోమ్ /వార్తలు /సినిమా /

Sai Dharam Tej: రిపబ్లిక్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్.. వీడియో వైరల్..

Sai Dharam Tej: రిపబ్లిక్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్.. వీడియో వైరల్..

Sai Dharam Tej celebrates Republic success on zee5  Photo : Twitter

Sai Dharam Tej celebrates Republic success on zee5 Photo : Twitter

Sai Dharam Tej | Republic : థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ విడుదలైంది. ఈ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఓటీటీలో విడుదలైన సందర్భంగా హీరో సాయి తేజ్ 'జీ 5' ఓటీటీ వేదికలో 'రిపబ్లిక్' సినిమా చూశారు.

సాయితేజ్,  (Sai Dharam Tej) దేవ కట్టా (Deva Katta) కాంబినేషన్‌లో వచ్చిన పొలిటికల్ డ్రామా రిపబ్లిక్. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే మొదటినుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు దేవా కట్టా. ఆయన గత సినిమాలు ఈ జానర్‌లో వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. దీనికితోడు ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి.. టీజర్స్ వరకు అదరగొట్టాయి. దీనికి తోడు వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న (Republic) 'రిపబ్లిక్' సినిమాపై మంచి అంచనాలున్నాయి. సీనియర్ నటి రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించారు. జిల్లా కలెక్టర్‌గా సాయిధరమ్, రాజకీయ నాయకురాలు రమ్యకృష్ణను ఢీకొని ప్రజా సమస్యల మీద తనకున్న పరిథిలో ఎలా పోరాడాడు అన్నది రిపబ్లిక్ సినిమాలో చర్చించారు దేవా కట్టా.

ఇక థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ విడుదలైంది. ఈ సినిమా ఈ నెల 26న జీ5లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక ఓటీటీలో విడుదలైన సందర్భంగా హీరో సాయి తేజ్ 'జీ 5' ఓటీటీ వేదికలో 'రిపబ్లిక్' సినిమా చూశారు. చిత్ర దర్శకుడు దేవ కట్టా, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీష్ బీకేఎఆర్, జీ స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలతో కలిసి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయితేజ్‌కు సెప్టెంబర్ 10న కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో పక్కటెముకలు విరగడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

ఇక రిపబ్లిక్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) నటించారు.  మరో కీలకపాత్రలో జగపతి బాబు కనిపించారు. జేబీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించింది. అయితే థియేటర్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది రిపబ్లిక్.

RRR : సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్ ఆర్ ఆర్.. రన్ టైమ్ తెలిస్తే మైండ్ బ్లాంకే...

సినిమా కి ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ వచ్చినా కానీ పెద్దగా వసూలు చేయలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే అంచనాలను అందు కోలేక చతికిల పడింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రిపబ్లిక్ సినిమా మొత్తం మీద 10 రోజుల్లో 6.65 కోట్ల షేర్‌ని సొంతం చేసుకుంది.

సినిమా కంటెంట్ పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ ఆడియన్స్ అంచనాలు వేరేగా ఉండటంతో సినిమా బిజినెస్‌ను అందుకోలేక లాస్‌ను సొంతం చేసుకుంది. రిపబ్లిక్ సినిమా (Republic world wide collections) మొత్తం బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. ఇక ఈ సినిమాను 12 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. టోటల్‌గా థియేటర్ రన్ పూర్తి చేసుకుని.. బాక్స్ ఆఫీస్ దగ్గర 5.64 కోట్ల లాస్‌ను సొంతం చేసుకుని.. సినిమా డిసాస్టర్‌గా నిలిచింది.

First published:

Tags: Republic Movie, Sai Dharam Tej, Tollywood news

ఉత్తమ కథలు