అవునా.. ఈ అద్భుతం ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? అసలు సాయి ధరమ్ తేజ్ ఏంటి.. బాహుబలి రికార్డులు క్రాస్ చేయడం ఏంటి కన్ఫ్యూజన్ కూడా ఉంది కదా. నిజమే.. కానీ ఇప్పుడు జరిగింది తెలిస్తే షాక్ తప్పదు మరి. ఈయన ప్రతిరోజూ పండగే సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుంది. ఈ చిత్రం ఇప్పటికే 31 కోట్ల షేర్ వసూలు చేసి అటు మారుతి.. ఇటు సాయి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ దూకుడు కొనసాగుతూనే ఉంది. మరో సినిమా ఏదీ లేకపోవడం.. పోటీగా వచ్చిన ప్రతీ సినిమా డిజాస్టర్ కావడంతో ప్రతిరోజూ పండగే నిజంగానే పండగ చేసుకుంటున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా 14 రోజుల్లో ఇప్పటికే 32 కోట్లు షేర్ వసూలు చేసి.. 40 కోట్ల వైపు అడుగులేస్తుంది.
ఇదిలా ఉంటే విడుదలైన 13వ రోజు ప్రతిరోజూ పండగే 2.91 కోట్ల షేర్ వసూలు చేసింది. అసలు మూడు రోజుల తర్వాత కలెక్షన్స్ చల్లబడిపోతున్న ఈ రోజుల్లో 13వ రోజు కూడా 2.91 కోట్ల షేర్ వసూలు చేసిందంటే దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి 2 మాత్రమే విడుదలైన 13వ రోజు 4.98 కోట్ల షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత మరే సినిమాకు ఇది సాధ్యం కాలేదు. బాహుబలి కూడా 13వ రోజు 3 కోట్ల కంటే తక్కువే షేర్ తీసుకొచ్చింది. కానీ సాయి మాత్రం ఇది చేసి చూపించాడు. మరో సినిమా ఏదీ లేకపోవడంతో దుమ్ము దులిపేస్తున్నాడు మెగా మేనల్లుడు. మొత్తానికి అరడజన్ ఫ్లాపుల తర్వాత అదిరిపోయేలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు సాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood