హోమ్ /వార్తలు /సినిమా /

వియ్యంకులు అవుతున్న సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్..

వియ్యంకులు అవుతున్న సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్..

సాయి ధరమ్ తేజ్ మంచు మనోజ్ (manchu manoj sai dharam tej)

సాయి ధరమ్ తేజ్ మంచు మనోజ్ (manchu manoj sai dharam tej)

Sai Dharam Tej Manchu Manoj: అదేంటి.. అప్పుడే అంత పెద్ద వాళ్లు అయిపోయారా..? వీళ్లు వియ్యంకులు కావడం ఏంటి విచిత్రం కాకపోతేనూ అనుకుంటున్నారా..? అవును మరి.. 2020లో ఇలాంటి విచిత్రాలు..

అదేంటి.. అప్పుడే అంత పెద్ద వాళ్లు అయిపోయారా..? వీళ్లు వియ్యంకులు కావడం ఏంటి విచిత్రం కాకపోతేనూ అనుకుంటున్నారా..? అవును మరి.. 2020లో ఇలాంటి విచిత్రాలు ఇంకా చాలా చూడాల్సిందే. అసలు విషయం ఏంటంటే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ నిజంగానే ఇప్పుడు వియ్యంకులు కాబోతున్నారు. ఇదే విషయాన్ని మనోజ్ ట్వీట్ చేసాడు కూడా. మనోజ్, సాయిల దగ్గర రెండు కుక్కలు ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ దగ్గర ఉన్న మక కుక్క, తన దగ్గర ఉన్న ఆడ కుక్కతో డేటింగ్ చేస్తుందని మనోజ్ ట్వీట్ చేసాడు. కరోనా సమయంలో భౌతిక దూరం పాటిస్తూ టాంగో, జోయాలు డేట్ చేస్తున్నాయని చెప్పాడు మనోజ్.


తనకు ఇంత మంచి అల్లుడిని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు.. త్వరలోనే ముహూర్తం పెట్టించి శుభలేఖలు వేయిస్తామంటూ మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ ఇద్దరూ తమ కుక్కలతో ఉన్న ఫోటోలను షేర్ చేసారు. త్వరలోనే పెళ్లి చేస్తామంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే మనోజ్ ప్రస్తుతం అహం బ్రహ్మాస్మితో సాయి సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో బిజీగా ఉన్నారు. మొత్తానికి ఈ ఇద్దరు హీరోలు చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

First published:

Tags: Manchu Manoj, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు