Home /News /movies /

SAI DHARAM TEJ ACCIDENT ARGUMENTS BETWEEN HARISH SHANKAR AND TV9 JOURNALIST DONTHU RAMESH GOES VIRAL ON SOCIAL MEDIA SR

Sai Dharam Tej Accident: సాయి తేజ్ ప్రమాదం | దర్శకుడు హరీష్ శంకర్‌కు టీవీ9 జర్నలిస్ట్‌కు వాగ్వాదం.. ట్వీట్స్ వైరల్..

Harish Shankar Photo : Twitter

Harish Shankar Photo : Twitter

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి ప్రసారం విషయంలో ట్విట్టర్ వేదికగా దర్శకుడు హరీష్ శంకర్‌కు టీవీ9 జర్నలిస్ట్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఆ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం (Sai Dharam Tej Health Condition) విషయంలో అభిమానులు ఎలాంటి కంగారు పడాల్సిన పనిలేదని నిన్నటి నుంచి ఓ వైపు వైద్యులు, మరో వైపు కుటుంబ సభ్యులు చెబుతూనే ఉన్నారు. ఇక తాజాగా నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఆయన ఆరోగ్య పరిస్ధితిపై హెల్త్ బులెటిన్ (Sai Dharam Tej Health Bulletin ) విడుదలైంది. ఆయన చికిత్సకు రెస్పాండ్ అవుతున్నారని డాక్టర్స్ తెలిపారు. సాయి తేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని పేర్కోన్నారు.

  అంతేకాదు మరో 24 గంటల్లో సాయి తేజ్ స్పృహలోకి వచ్చే అవకాశం ఉందని, స్పృహలోకి వచ్చిన తర్వాతే కాలర్ బోన్ శస్త్ర చికిత్సపై నిర్ణయం తీసుకుంటామని వైద్యులు ఆ బులెటిన్‌లో పేర్కోన్నారు. తదుపరి హెల్త్ బులెటిన్ ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు విడుదలకానుంది.

  ఇక అది అలా ఉంటే ఆయన బైక్ యాక్సిడెంట్ విషయంలో కొన్ని టీవీ ఛానల్స్ విష ప్రచారం చేస్తున్నాయని.. తప్పుడు కథనాలు అల్లు తున్నాయని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్‌లో చురకలు అంటించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతూ.. హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ఎందరికో అన్నం పెడుతున్నావ్.. హ్యాట్సాఫ్ తమ్ముడు. నీ ఆక్సిడెంట్ వంకతో.. తప్పుడు వార్తలు అమ్ముకొని, బతికేస్తున్న అందరు బాగుండాలి, వాళ్లకు ఆ అన్నం అరగాలి అని కోరుకుంటున్నట్టున్నాను అంటూ కొన్ని ఛానల్స్‌ను ఉద్దేశించి ఆయన చురకలు అంటించారు.  అయితే హరీష్ శంకర్ (Harish Shankar) చేసిన ట్వీట్‌కు టీవీ9 జర్నలిస్ట్ దొంతు రమేష్ స్పందించారు. ఆయన హరీష్‌కు పోస్ట్‌కు బదులు ఇస్తూ.. ఈ మధ్య మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది.. తప్పుడు కథలు కథనాలు హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించుకోవచ్చు కానీ తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు అతి వేగంతో వెళ్లి మీరు ప్రమాదానికి గురికావడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు ఆయన తన పోస్ట్’లో రిప్లై ఇచ్చారు.  టీవీ9 జర్నలిస్ట్ దొంతు రమేష్ (Donthu Ramesh) ట్వీట్‌కు దర్శకుడు హరీష్ శంకర్ బదలిచ్చారు. నేను “తప్పుడు వార్తలు“ అని క్లియర్‌గా చెప్పానని, మీరెందుకు అందరికంటే ముందు భుజాలు తడుముకుంటున్నారు… అంటే మీరు తప్పుడు వార్తలు రాస్తున్నారని ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నించారు. అంతేకాదు మా సినిమాల్లో హింస అన్నారు మాకు సెన్సార్ ఉంది మేము వాళ్లకు సమాధానం చెప్పుకుంటామని, మీకేముంది మీరు దేనికి సమాధానం కాస్త చెబుతారా అని ప్రశ్నించారు. రమేష్ గారు నేను మీ వ్యవస్థని తప్పు పట్టట్లేదు వ్యవస్థని తప్పు దోవ పట్టించేవాళ్ల గురించి చెబుతున్నానని హరీష్ ఈ సందర్భంగా పేర్కోన్నారు.

  ఇక అది అలా ఉంటే అసలు సాయి తేజ్ ప్రమాదానికి గురి కావాడానికి కారణం ఏంటీ.. ఆయన వాడిన బైక్ ఏంటీ.. ఆ బైక్ ధర ఎంత ఉండోచ్చని నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. సాయి తేజ్ బండి స్కిడ్ కావ‌డానికి కార‌ణం అక్క‌డ అక్కడ మట్టి, బురద ఉండటం అని అంటున్నారు. ఇక ఆయన బండి విషయానికి వస్తే.. బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే.. తేజ్ ఈ బైక్‌ని రీసెంట్‌గా హైదరాబాద్‌లో కొనుగోలు చేశారు. TS07 GJ1258 ఇది ఆ బైక్ రిజిష్ట్రేషన్ నంబర్. ఆయన వాడిన బైక్ పేరు ట్రయంప్ కంపెనీకి చెందినదిగా తెలుస్తోంది. ఆ బైక్ ఖరీదు రూ. ఏడు లక్షలుగా ఉంది. ఈ స్పోర్ట్స్ బైక్ 660 సీసీ ఇంజన్‌ను కలిగి ఉన్న హై ఎండ్ బైక్. దీని బ‌రువు దాదాపు 189 కేజీల వ‌ర‌కు ఉంటుంది.

  శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ బైక్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్‌ తేజ్‌ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్మెట్ ఉన్నప్పటికీ సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు అయినట్టుగా వార్తలు వచ్చాయి.

  మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం సాయిధరమ్ తేజ్‌ను జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లి సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. అనంతరం చిరంజీవి అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీలోని సభ్యులంతా ఆస్పత్రికి చేరుకుని సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు మెగా అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు.

  ఇక మరోవైపు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఘటనపై మాదాపూర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బైక్‌ను నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Director harish shankar, Sai Dharam Tej, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు