‘డార్లింగ్స్ ఇక పండగే..’ గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్

ప్రభాస్, సుజిత్

Sahoo Pre Release | సాహో సినిమా ఈనెల 30న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.

  • Share this:
    ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. దర్శకుడు సుజిత్, హీరోయిన్ శ్రద్ధా కపూర్, రాజమౌళి, వీవీ వినాయక్, కృష్ణం రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో తన డైహార్డ్ ఫ్యాన్స్‌కు హీరో ప్రభాస్ ఓ హామీ ఇచ్చాడు. గతంలో బాహుబలి సినిమా తర్వాత ఏడాదిలో రెండు సినిమాలు తీసి అభిమానులకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానని కానీ, సాహో వల్ల కుదరలేదని చెప్పాడు. అయితే, ఈ సారి మాట ఇవ్వకుండా కనీసం ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. సాహో సినిమా ఈనెల 30న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ కావడంతో ప్రభాస్ మార్కెట్ కూడా భారీ ఎత్తున ఉండడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: