• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SAHOO PRE RELEASE EVENT HERO PRABHAS PRAISES DIRECTOR SUJEETH AND SHRADDHA KAPOOR BA

Saaho Pre Release | నిక్కర్ వేసుకొచ్చి ప్రభాస్‌కు కథ చెప్పిన సుజిత్

సాహో ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ప్రభాస్

Prabhas Saaho Updates | సుజిత్‌ను చూస్తుంటే గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడేమోనని డౌట్ వస్తుందని ప్రభాస్ అనడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ హోరెత్తిపోయింది.

  • Share this:
    ప్రభాస్ హీరోగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా బాలీవుడ్, కోలీవుడ్ నటులతో కూడిన భారీ బడ్జెట్ మూవీగా వస్తున్న సాహోసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలో సినిమా దర్శకుడు సుజిత్ మీద హీరో ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు. సాహో సినిమా కథ చెప్పడానికి నిక్కర్ వేసుకుని వచ్చాడంటూ ఛలోక్తులు విసిరాడు. 22 ఏళ్ల వయసుకే సినిమాను డైరెక్ట్ చేసిన సుజిత్ మీద ప్రశంసలు కురిపించాడు. సినిమా షూటింగ్‌కు ముందు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాడని, సినిమా కోసం సుమారు నాలుగేళ్లు కష్టపడ్డాడని చెప్పారు. పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడోనని భయపడ్డానని.. వారి మధ్య సయోధ్య చేసిన తీరు చూసి ముచ్చటేసిందన్నారు. సుజిత్‌ను చూస్తుంటే గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిపోతాడేమోనని డౌట్ వస్తుందని ప్రభాస్ అనడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ హోరెత్తిపోయింది. సాహో సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్రమ్ మీద ప్రభాస్ పొగడ్తల వర్షం కురిపించాడు. సినిమాను తెలివిగా తీసి ఉంటే రూ.100 కోట్ల లాభం వచ్చేదని, అయితే, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా కోసం ఖర్చు పెట్టారన్నారు.
    First published: