Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /సినిమా /

Sahasra Entertainments: సహస్ర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

Sahasra Entertainments: సహస్ర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

సహస్ర ఎంటర్టైన్మెంట్ కొత్త చిత్రం ప్రారంభం (Twitter/Photo)

సహస్ర ఎంటర్టైన్మెంట్ కొత్త చిత్రం ప్రారంభం (Twitter/Photo)

Sahasra Entertainments: సహస్ర ఎంటటైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌(Hyderabad)లో లాంఛనంగా ప్రారంభం అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Sahasra Entertainments: సహస్ర ఎంటర్టైన్మెంట్స్  ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌(Hyderabad)లో లాంఛనంగా ప్రారంభం అయింది. అంతా కొత్త నటీనటులైన విశ్వంత్ (Vishwanth) హీరోగా, శిల్పా మంజునాథ్ (Shilpa Manjunath), రియా సచ్ దేవ (Riya Sacha deva) ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రాన (Basi Reddy Rana) దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar), సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. క్రైమ్ థ్రిల్లర్ (Crime Thriller) నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామ్ (Ram) సినిమాటోగ్రఫీ (Cinemotography) అందిస్తున్నారు. హైదరాబాద్ (hyd), కర్నూల్ (Kurnool)పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. నరేంద్ర బుచ్చి రెడ్డి (Narendra Butchi Reddy) నిరిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 14  నుండి ప్రారంభం కానుంది.

సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ (Sakshi Shiva), శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కాబోతున్నాయి. సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం నిర్మితమవుతుంది.

నటీనటులు: విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ, సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి తదితరులు

బ్యానర్: సహస్ర ఎంటర్టైన్మెంట్స్

సమర్పణ: నిశాంత్ ప్రెజెంట్స్

దర్శకత్వం: బసి రెడ్డి రాన

నిర్మాత: నరేంద్ర బుచ్చి రెడ్డిగారి

సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి

మ్యూజిక్: లిజో కె జోష్

ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల

ఆర్ట్: నిఖిల్ హాసన్

పిఆర్ఒ: శ్రీధర్

First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు