Sadha - NBK - Jr NTR: బాలకృష్ణ, ఎన్టీఆర్‌లపై సదా షాకింగ్ కామెంట్స్.. ఆ హీరోతో ఎఫైర్ గురించి స్పందించిన ‘అపరిచితుడు’ భామ..

సదా,బాలయ్య, ఎన్టీఆర్ (Youtube/ETV/Credit)

Sadha - NBK - Jr NTR: టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో తనదైన ఆకట్టుకున్న హీరోయిన్ ’సదా’.. తాజాగా ఈ భామ ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీ తో సరదగా’ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ హీరో బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ లపై  షాకింగ్ కామెంట్స్ చేసారు.

  • Share this:
    Sadha - NBK - Jr NTR: టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో తనదైన ఆకట్టుకున్న హీరోయిన్ ’సదా’.. తాజాగా ఈ భామ ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీ తో సరదగా’ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ హీరో బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ లపై  షాకింగ్ కామెంట్స్ చేసారు. వివరాల్లోకి వెళితే.. తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘జయం’ సినిమాతో కథానాయికగా పరిచయమైన ’సదా’ ఆ తర్వాత తెలుగు, తమిళంలో అగ్ర కథానాయికగా సత్తా చాటింది. తమిళంలో శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘అపరిచితుడు’  సినిమా కథానాయికగా సదాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సదా కెరీర్‌లో ‘జయం’తో పాటు ‘అపరిచితుడు’ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి.  తెలుగులో ఈ భామ‘నాగ’లో ఎన్టీఆర్ సరసన నటించింది. మరోవైపు బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరభద్ర’లో కథానాయికగా యాక్ట్ చేసింది. తాజాగా ఈ భామ ఆలీతో సరదాగా  కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ భామకు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో పలు రియాలిటీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.

    ఈ సందర్భంగా ఆలీతో సరదగా కార్యక్రమంలో  ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి డాన్సర్‌ను తాను ఇంత వరకు చూడలేదన్నారు. ఎలాంటి క్లిష్టమైన మూమెంట్స్ అయిన ఎన్టీఆర్ ఎంతో ఈజ్‌తో చేస్తారంటూ కితాబు ఇచ్చారు. ‘నాగ’ సినిమా సమయంలో ఎన్టీఆర్‌తో డాన్స్‌ చేయడానికి ఎంతో కష్టపడ్డానన్నారు.

    Sadha - NBK - Jr NTR: టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో తనదైన ఆకట్టుకున్న హీరోయిన్ ’సదా’.. తాజాగా ఈ భామ ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీ తో సరదగా’ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ హీరో బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ లపై  షాకింగ్ కామెంట్స్ చేసారు.
    సదా (Youtube/ETV/Credit)


    వర్క్ విషయంలో తారక్.. ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేస్తారన్నారు. మరోవైపు బాలయ్య గురించి మాట్లాడుతూ.. ఆయనతో ‘వీరభద్ర’ సినిమాలో నటించాను.ఆయనలో ఓ  చిన్నపిల్లాడు ఉన్నారంటూ ఒకింత షాకింగ్ కామెంట్స్ చేసారు. అంతేకాదు సెట్స్‌తో పాటు బయట కూడా ఎంతో యాక్టివ్‌గా ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఆయన ఎనర్జీకి మారు పేరు అంటూ చెప్పుకొచ్చారు.

    vikram sada brother and sister,vikram sada,sada in alitho saradaga show,alitho saradaga show promo,alitho saradaga show sada show,sada vikram aparichitudu movie,telugu cinema,అపరిచితుడు విక్రమ్,విక్రమ్ సదా అన్నాచెల్లెలు,విక్రమ్ సదా అలీతో సరదాగా షో
    ’అపరిచితుడు’లో సదా (Instagram/Photo)


    ఇక ‘అపరిచితుడు’లో విక్రమ్‌తో తన అనుభవాలను పంచుకున్నారు. ఎంత వర్క్ ఉన్న విక్రమ్ ఎంతో రిలాక్స్‌గా కూల్‌గా ఉంటారన్నారు. ఇక తమిళంలో మాధవన్‌తో ఏకంగా మూడు సినిమాలు చేయడంతో ఆయనతో తనకు ఎఫైర్ ఉందని ప్రచారం కూడా జరిగిందన్నారు. సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ అనేవి ఎంతో కామన్. వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నాకు తర్వాత తెలిసిందన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: