‘జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా?’ : రెచ్చిపోయిన సదా

Srimati 21F Trailer Talk : సదా నటించిన 'టార్చ్ లైట్' అనే తమిళ సినిమా తెలుగులో 'శ్రీమతి 21F'గా విడుదలౌతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

news18-telugu
Updated: October 18, 2019, 9:37 AM IST
‘జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా?’ : రెచ్చిపోయిన సదా
శ్రీమతి 21Fలో సదా... Youtube
  • Share this:
సదా.. ‘జయం’ సినిమాలో నితిన్ సరసన క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో  వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్ల గొట్టింది. 'జయం' సినిమా మంచి హిట్ అవ్వడంతో  వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. అందులో భాగంగా ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్, నటుడు విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఆ సినిమాలో సదా నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా 'నీకు నాకు నోకియా' అనే సాంగ్‌లో సదా అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా ఆ సినిమాలో తన అందచందాలతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసిన.. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోవడంతో సదాకు అవకాశాలు సన్నగిల్లాయి. కాగా కొన్ని రోజులు రియాలీటి షోల్లో జడ్జిగా కూడా అలరించిన సదా తాజాగా వేశ్యలకు సంబంధించిన ఓ సినిమాతో ముందుకొచ్చింది.

Sada hot film,torch light release in telugu,torch light,torch light movie,mobile torch light in telugu,torch light telugu movie,torchlight telugu movie,best torch light in india,telugu,sadha hot in torch light,srimati 21f trailer,Sada tamil film torch light,,Sada new telugu film,సదా,సదా శ్రీమతి 21F,సదా శ్రీమతి 21F ట్రైలర్,,
Facebook/ActressSadha


శృంగారమే ప్రధాన వస్తువుగా వస్తోన్న ‘శ్రీమతి 21F’ చిత్రంలో సదా ప్రదాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో సదా వేశ్య పాత్రలో అలరించనుంది. కాగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తమిళనాడు ఆంధ్ర హైవేలో 1990లో ఒక వేశ్య జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా వస్తోంది.

తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సదా ఓ సీన్‌లో ‘జాకెట్ నేను విప్పనా.. నువ్వే విప్పుతావా?’.. అంటూ ఆశ్చర్చానికి గురిచేసింది. సినిమా ట్రైలర్‌ను చూస్తుంటే బలమైన నేపథ్యం ఉన్న కథతో మంచి సందేశాన్ని ఇచ్చే పాత్రలో సదా కనిపించనుందని తెలుస్తోంది. ఈ సినిమాను అబ్దుల్ మజీత్ దర్శకత్వం వహించగా.. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
First published: October 18, 2019, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading