Sacrifice Star Sunishith: శాక్రిఫైజ్ స్టార్‌ సునిశిత్‌ అరెస్ట్‌..

సోది స్టార్ సునిశిత్..! శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్..! యూట్యూబ్, టిక్ టాక్ వీడియోలు చూసేవారికి ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసారు.

news18-telugu
Updated: July 23, 2020, 7:41 PM IST
Sacrifice Star Sunishith: శాక్రిఫైజ్ స్టార్‌ సునిశిత్‌ అరెస్ట్‌..
శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ అరెస్ట్ (File/Photo)
  • Share this:
సోది స్టార్ సునిశిత్..! శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్..! యూట్యూబ్, టిక్ టాక్ వీడియోలు చూసేవారికి ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ఇతడిని పోలీసులు అరెస్ట్ చేసారు. కరోనా రాక ముందు ఇతగాడు యూట్యూబ్‌లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.  ఇతడి గురించి చెప్పాలంటే కొండవీటి ఛాంతాడంతా కథ ఉంది.  అంతలా సోది కబుర్లు చెప్పి యూబ్యూబ్‌లో ట్రెండ్ అయ్యాడు. మహేష్ బాబు '1 నేనొక్కడినే', జూనియర్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో..' పాటు పలు సినిమాల్లో మనోడికే ముందు అవకాశం వచ్చిందంట. కానీ హీరోలు ఒత్తిడి చేయడంతో డైరెక్టర్లు తనను మోసం చేశానని పలు యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అంతేకాదు జబర్దస్త్ స్టార్ సుధీర్, స్మాల్ స్క్రీన్ యాంకర్ యాంకర్ ప్రదీప్, హీరో రవితేజపై కేసులు కూడా పెట్టానని.. బాహుబలి సినిమాలో పాట పాడానని ఎన్నో కహానీలు చెప్పాడు సునిశిత్. అంతటితో ఆగక.. హీరోయిన్లు తమన్నా, లావణ్య త్రిపాఠితో లవ్ ఎఫైర్లు కూడా నడిపించానని కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. మరో అడుగు ముందుకేసి లావణ్య త్రిపాఠిని ఇదివరకే పెళ్లి చేసుకున్నానని..కొన్ని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందంటూ తెగ ప్రచారం చేశాడు. ఆధారాలు అడిగితే మాత్రం నీళ్లు నములాడు.

tollywood actress lavanya tripathi filed case against sacrifice star sunishit are in hyderabad,lavanya tripati,tollywood,sunishit funny,sunishit interview,sunishit youtube,sunishit tiktok,telugu news,లావణ్య త్రిపాఠి,సునిశిత్,సునిషిత్,టాలీవుడ్,సునిశిత్ వీడియోలు
లావణ్య త్రిపాఠి, సునిశిత్ (File/Photo)


తనను పెళ్లి చేసుకున్నట్టు చెప్పిన సాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ పై లావణ్య త్రిపాఠి ఎపుడో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెతో పాటు పలువురు సునిశిత్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ క్రమంలో ఈ సాక్రిఫైజ్ స్టార్ పై రాచకొండ కమిషనరేట్‌‌లో  పరిధిలోని ఇబ్రహీం పట్నంతో పాటు కీసరలో కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు సునిశిత్‌ను తమ అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 23, 2020, 7:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading