మెగాస్టార్ చిరంజీవి, సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. తాజాగా ఈ చిత్రంలోని ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ఫుల్ వీడియోను యూట్యూబ్ లో మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో రెజీనా కసాండ్రాతోతో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను రేవంత్, గీతామాధురి పాడగా, భాస్కరభట్ల పాటకు లిరిక్స్ రాశారు.
ఈ సినిమాలో చిరు సరసన రెండోసారి కాజల్ నటిస్తోంది. ఇక, సిద్ధ పాత్రలో నటిస్తున్న రామ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్ కు మంచి స్పందన వచ్చింది. ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aacharya, Acharya movie