#YeChotaNuvvunnaSong: ‘సాహో’ సాంగ్ రిలీజ్.. ప్రభాస్, శ్రద్ధా కపూర్ రొమాన్స్ అదుర్స్..

#YeChotaNuvvunnaSong: ‘సాహో’ సాంగ్ రిలీజ్.. ప్రభాస్, శ్రద్ధా కపూర్ రొమాన్స్ అదుర్స్.. సాహో నుంచి మరో పాట విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎంత గ్రాండ్‌గా ఉండబోతుందో మరోసారి రుజువైంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 2, 2019, 2:46 PM IST
#YeChotaNuvvunnaSong: ‘సాహో’ సాంగ్ రిలీజ్.. ప్రభాస్, శ్రద్ధా కపూర్ రొమాన్స్ అదుర్స్..
సాహో సాంగ్ ఫైల్ ఫోటో
  • Share this:
సాహో నుంచి మరో పాట విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎంత గ్రాండ్‌గా ఉండబోతుందో మరోసారి రుజువైంది. దర్శకుడు సుజీత్ తాను ఖర్చు పెట్టించిన 300 కోట్లు స్క్రీన్ పై చూపించాలని ఫిక్సైపోయాడు. అందుకే పాటల్లో కూడా ఆ గ్రాండ్ నెస్ కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన సైకో సయ్యాన్ సాంగ్ వైరల్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఏ చోట నువ్వున్నా అనే పాట విడుదలైంది. ఇందులో ప్రభాస్ హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. మరోవైపు శ్రద్ధాకపూర్ అయితే అందాలతో ప్రాణం తీసేసింది. గ్లామర్ షోతో పిచ్చెక్కించేసింది ఈ ముద్దుగుమ్మ.

ప్రభాస్, శ్రద్ధా మధ్య రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంది. స్టైలిష్ అవతారంలో ఉన్న ప్రభాస్‌ను చూసి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. కేకే రాసిన ఈ పాట ప్రభాస్ అభిమానులను బాగానే ఆకట్టుకుంటుంది. మన రెగ్యులర్ తెలుగు బీట్ కాదు ఇది.. నేషనల్ వైడ్‌గా సాహో విడుదలవుతుంది కాబట్టి అందరికీ నచ్చేలా ట్యూన్స్ ఇచ్చారు సంగీత దర్శకులు. జిబ్రన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకోవడంతో ఆ బాధ్యత తీసుకున్నాడు జిబ్రన్. ఆగస్ట్ 30న విడుదల కానుంది సాహో. మరి పాటలే ఇంత గ్రాండ్‌గా ఉంటే రేపు సినిమా ఎలా ఉండబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: August 2, 2019, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading