‘సాహో’ రికార్డుల వేట షురూ.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని స్క్రీన్స్ తెలుసా..?

సాహో.. సాహో.. సాహో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఈ సినిమా చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే సాహో మేనియా మామూలుగా లేదు. టికెట్స్ కోసం యుద్ధాలు చేస్తున్నారు అభిమానులు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 29, 2019, 5:10 PM IST
‘సాహో’ రికార్డుల వేట షురూ.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని స్క్రీన్స్ తెలుసా..?
సాహో పోస్టర్స్ (Source: Twitter)
  • Share this:
సాహో.. సాహో.. సాహో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఈ సినిమా చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే సాహో మేనియా మామూలుగా లేదు. టికెట్స్ కోసం యుద్ధాలు చేస్తున్నారు అభిమానులు. మరోవైపు ఈ సినిమా విడుదలవుతున్న తీరు కూడా ఇప్పుడు సంచలనమే. ముఖ్యంగా ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా సాహో భారీగా రిలీజ్ అవుతుంది. మరీ ముఖ్యంగా దుబాయ్‌లో సాహో విడుదల సంచలనంగా మారిందిప్పుడు. అక్కడ ఇదివరకు ఏ ఇండియన్ సినిమా కూడా విడుదల కాని స్థాయిలో.. ఏకంగా 385 స్క్రీన్స్‌లో రాబోతుంది.
Saaho Worldwide Screen count and Prabhas movie is going to release in record screens in UAE pk సాహో.. సాహో.. సాహో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఈ సినిమా చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే సాహో మేనియా మామూలుగా లేదు. టికెట్స్ కోసం యుద్ధాలు చేస్తున్నారు అభిమానులు. saaho saaho movie twitter,saaho pre release business,saaho movie release,saaho movie screen count,saaho UAE release,saaho screen count UAE,saaho business,saaho movie review,prabhas saaho movie,telugu cinema,సాహో,సాహో రిలీజ్ డేట్,సాహో ప్రీ రిలీజ్ బిజినెస్,సాహో స్క్రీన్ కౌంట్,తెలుగు సినిమా
సాహో స్క్రీన్ కౌంట్ (Source: Twitter)


హిందీలో 132.. తమిళ్ 97.. తెలుగు 91.. మళయాలం 65 స్క్రీన్స్ లో విడుదల కానుంది సాహో. తెలుగు కంటే ఎక్కువగా తమిళంలోనే అక్కడ విడుదల కానుండటం విశేషం. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం దాదాపు 800 స్క్రీన్స్ లో విడుదల కానుందని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 1600 స్క్రీన్స్.. తమిళనాడులో 550 స్క్రీన్స్.. కేరళలో 150 స్క్రీన్స్‌తో పాటు హిందీలో 4500 స్క్రీన్స్‌లో సాహో విడుదలకు సిద్ధమైంది.
Saaho Worldwide Screen count and Prabhas movie is going to release in record screens in UAE pk సాహో.. సాహో.. సాహో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఈ సినిమా చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే సాహో మేనియా మామూలుగా లేదు. టికెట్స్ కోసం యుద్ధాలు చేస్తున్నారు అభిమానులు. saaho saaho movie twitter,saaho pre release business,saaho movie release,saaho movie screen count,saaho UAE release,saaho screen count UAE,saaho business,saaho movie review,prabhas saaho movie,telugu cinema,సాహో,సాహో రిలీజ్ డేట్,సాహో ప్రీ రిలీజ్ బిజినెస్,సాహో స్క్రీన్ కౌంట్,తెలుగు సినిమా
సాహో స్క్రీన్ కౌంట్ (Source: Twitter)

ప్రపంచ వ్యాప్తంగా ఈ లెక్క దాదాపు 8 నుంచి 9 వేల స్క్రీన్స్ మధ్య ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన తొలిరోజు చాలా రికార్డులు బద్ధలైపోవడం ఖాయం. సుజీత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధా కపూర్ నటించింది. ఇక ఇందులో బాలీవుడ్ నటులు కూడా చాలా మందే ఉన్నారు. మరి చూడాలిక.. సాహో విడుదలకు ముందే ఇన్ని రికార్డులు తిరగరాస్తుంటే.. వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: August 29, 2019, 5:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading