హోమ్ /వార్తలు /సినిమా /

Saaho Trailer Talk: ‘సాహో’ హిందీ వెర్షన్ కోసం మాట నిలబెట్టుకున్న ప్రభాస్..

Saaho Trailer Talk: ‘సాహో’ హిందీ వెర్షన్ కోసం మాట నిలబెట్టుకున్న ప్రభాస్..

‘సాహో’ ట్రైలర్ టాక్ (ట్విట్టర్ ఫోటో)

‘సాహో’ ట్రైలర్ టాక్ (ట్విట్టర్ ఫోటో)

అవును ప్రభాస్.. హిందీ సినిమ ా కోసం అన్నంత పని చేసి మాట నిలబెట్టుకున్నాడు. ఇది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

  అవును ప్రభాస్.. హిందీ సినిమ ా కోసం అన్నంత పని చేసి మాట నిలబెట్టుకున్నాడు. ఇది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. వివరాల్లోకి వెళితే..గత కొన్నేళ్లుగా మన హీరోలు..ఒక భాషకే పరిమతం కాకుండా అన్ని భాషల్లో తమ మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డారు. బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమాలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. తాజాగా ప్రభాస్ ‘సాహో’ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు హిందీ,తమిళం,మలయాళంలో తెరకెక్కించాడు. అంతేకాదు ఆయా భాషలకు సంబంధించిన ట్రైలర్స్‌ను విడుదల చేసాడు. ఇక తమిళం, మలయాళంలో ప్రభాస్ పాత్రకు వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. కానీ ‘సాహో’ హిందీ వెర్షన్‌కు మాత్రం ప్రభాస్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. గతంలో ‘బాహుబలి’ సినిమా హిందీ వెర్షన్ అపుడే తన నెక్ట్స్ సినిమా వరకు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం ఇపుడు ‘సాహో’ హిందీ వెర్షన్ కోసం తన పాత్రకు తానే డబ్బింగ్  చెప్పుకుని అభిమానులను ఖుషీ చేసాడు.

  తాజాగా రిలీజైన ‘సాహో’ ట్రైలర్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాదు హిందీ వెర్షన్‌లో ప్రభాస్ చెప్పిన డైలాగులు అదిరిపోయాయి. ఏమైనా ప్రభాస్  హిందీలో ‘సాహో’ సినిమా రిలీజ్ చేయడమే కాదు..అక్కడివాళ్లకు కనెక్ట్ కానీకి హిందీలో ఓన్ డబ్బింగ్ చెప్పుకోవడం శుభపరిణామం అనే చెప్పాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood, Hindi Cinema, Prabhas, Saaho, Saaho Movie Review, Shraddha Kapoor, Sujeeth, Telugu Cinema, Tollywood, UV Creations

  ఉత్తమ కథలు