బాలీవుడ్ ఊపిరి పీల్చుకో.... ప్రభాస్ వస్తున్నాడు..

బాహుబలి సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ప్రభాస్‌తో ఓ హిందీ సినిమా చేయాలని కరణ్ జోహార్ ప్రయత్నాలు చేశారు.

news18-telugu
Updated: August 24, 2019, 4:22 PM IST
బాలీవుడ్ ఊపిరి పీల్చుకో.... ప్రభాస్ వస్తున్నాడు..
ప్రభాస్ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇక బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తన బాహుబలి సినిమాతో ఉత్తరాదిలో కూడా ప్రభాస్ ఓ పెద్ద స్టార్ అయిపోయాడు. తాజాగా, సాహోతో మరోసారి బాలీవుడ్‌లో తెలుగువారి సత్తా చూపేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ప్రభాస్ డైరెక్ట్‌గా ఓ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్‌లో ప్రభాస్‌ను డైరెక్ట్ చేయబోయేది ఎవరో కాదు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్. ఓ మీడియా ఛానల్‌లకు ఇంటర్య్వూ ఇచ్చిన సందర్భంగా ప్రభాస్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బాహుబలి రిలీజ్ సమయంలో కరణ్ జోహార్ మాకు అండగా నిలిచారు. దేశంలోనే ‘అతిపెద్ద సినిమా’గా పేరు పెట్టింది కూడా కరణ్ జోహారే. ఇప్పుడు సాహోని కూడా అతడే బాలీవుడ్‌లో సమర్పిస్తున్నాడు. మేం పరస్పరం తెలుసు. కచ్చితంగా ఓ మంచి సినిమా చేస్తాం.’ అని ప్రభాస్ అన్నాడు.

Karan Johar's Dharma Productions' Godown Gutted by Fire, Valuable Memorabilia Lost,bahubali,bahubali producer karan johar,rrr ss rajamouli,prabhas bahubali rana karan johar,karan johar studio fire accident,fire accident accured in karan johar dharma production house,karan johar twitter,karan johar instagram,karan johar gay,karan johar kids,karan johar gurugram godown gutted by fire,karan johar valuable memorabilia lost,karan johar movies,karan johar interview,karan johar wife,karan johar family,karan johar twins,karan johar and srk,karan johar life story,karan johar biography,karan johar in the kapil sharma show,kalank karan johar,karan johar on kalank flop,gay karan johar,karan johar cars,is karan johar gay,karan johar house,karan johar dance,karan johar funny,bollywood,hindi cinema,bahubali karan johar,jabardasth comedy show,కరణ్ జోహార్,కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్,కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ హౌస్‌ లో అగ్ని ప్రమాదం,కరణ్ జోహార్ స్టూడియోలో అగ్ని ప్రమాదం,కరణ్ జోహార్ కు కోట్లలో ఆస్తి నష్టం,బాలీవుడ్ న్యూస్,బాహుబలి నిర్మాత కరణ్ జోహార్,
బాహుబలి టీమ్‌తో కరణ్ జోహార్


బాహుబలి సినిమా ప్రమోషన్స్ సమయంలోనే ప్రభాస్‌‌తో సినిమా గురించి కరణ్ జోహార్ చర్చించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, కరణ్ జోహార్ ఆఫర్‌ను ప్రభాస్ తిరస్కరించాడని ఓసారి, రెమ్యునరేషన్‌గా రూ.30 కోట్లు డిమాండ్ చేశాడనని మరోసారి ప్రచారం జరిగింది. అయితే, అవన్నీ ఒట్టి పుకార్లేనన్న విషయం ప్రభాస్ మాటలను బట్టి నిజమైంది.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading