సెల్ టవర్ ఎక్కిన ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్.. రెబల్ స్టార్ రాకపోతే దూకేస్తానంటూ బెదిరింపు..

తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అభిమానుల ఆరాధన పీక్స్‌లో ఉంటుంది. జనగామ జిల్లా ఉడుముల హాస్పిటల్‌లో ప్రభాస్ అభిమాని ఒకరు అక్కడ ఉన్న ఒక సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసాడు.

news18-telugu
Updated: September 11, 2019, 12:42 PM IST
సెల్ టవర్ ఎక్కిన ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్.. రెబల్ స్టార్ రాకపోతే దూకేస్తానంటూ బెదిరింపు..
ప్రభాస్ రావాలంటూ సెల్ టవర్ ఎక్కిన అభిమాని (Whatssup photo)
  • Share this:
తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అభిమానుల ఆరాధన పీక్స్‌లో ఉంటుంది. అక్కడ ఫ్యాన్స్ ఒకసారి ఆరాధించడం మొదలుపెడితే ఏకంగా ఆయా హీరోలకు, హీరోయిన్స్‌కు గుడులను సైతం కట్టేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అటువంటి సంఘటనలు చాలా తక్కువే అని చెప్పాలి. తాజాగా తెలంగానలోని జనగామ జిల్లాలో తమిళనాడు తరహా సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా ఉడుముల హాస్పిటల్‌లో ప్రభాస్ అభిమాని ఒకరు అక్కడ ఉన్న ఒక సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసాడు. అంతేకాదు సదరు వ్యక్తి ప్రభాస్‌కు వీరాభిమాని. అతను ప్రభాస్ వచ్చేంత వరకు సెల్ టవర్ దిగనని భీష్మించుకుని కూర్చున్నాడు. అంతేకాదు ప్రభాస్ అక్కడికి రాకుంటే టపర్ పై నుంచి దూకి చనిపోతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆ యువకుడిని కిందకు దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. సదరు యంగ్ రెబల్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ మాత్రం ప్రభాస్ వస్తేగానీ టవర్ పై నుంచి దిగేది లేదంటూ చెబుతున్నాడు. మరి ప్రభాస్ నిజంగానే అక్కడికి వచ్చి అభిమాని కోరిక తీరుస్తాడా లేదా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 11, 2019, 12:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading