Home /News /movies /

SAAHO SHADES OF SAAHO CHAPTER 2 PRABHAS SHRADDHA KAPOOR SUJEETH SAAHO CHAPTER 2 TEASER RELEASED NK

బూమ్.... సాహో సెకండ్ టీజర్ అదిరిందిగా... హాలీవుడ్ రేంజ్...

సాహో టీజర్ (Image : Twitter)

సాహో టీజర్ (Image : Twitter)

shades of Saaho : సాహో చాప్టర్ 2 అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు. ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగే.

టాలీవుడ్‌లో భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సాహో... సెకండ్ టీజర్ హై వోల్టేజ్ యాక్షన్‌తో దుమ్మురేపింది. తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో వస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌ పెట్టుకున్న అంచనాల్ని దాదాపు నిలబెట్టుకుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న నటి శ్రద్ధా కపూర్ బ‌ర్త్‌డే మార్చి 3న కావ‌డంతో ఇవాళ చాప్టర్ 2... టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో మెయిన్‌గా... మేకింగ్ షాట్స్‌ చూపించారు. యాక్షన్ సన్నివేశాలు... హాలీవుడ్ రేంజ్‌ని తలపించాయి. బుల్లెట్ల వర్షం కురిసింది. చివరకు శ్రద్ధా కపూర్ సైతం గన్ షాట్స్ చెయ్యడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు. రెండో టీజర్‌లో కూడా ప్రభాస్ చివర్లో కనిపించి బూమ్ అంటూ దుమ్మురేపాడు.


ఇప్పటికే షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 1 వీడియో విడుద‌లైంది. దానికి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వ‌చ్చింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సాహో చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, మలయాళం యాక్టర్‌ లాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆగ‌స్ట్ 15న ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నార‌ని టాక్.
First published:

Tags: Prabhas, Telugu Movie, Telugu Movie News, Tollywood, Tollywood Cinema

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు