Saaho Twitter Review : సాహో ట్విటర్ రివ్యూ.... సినిమా ఎలా ఉందంటే...

Saaho Twitter Review : బాహుబలి తరువాత ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో.. 300 కోట్ల బడ్జెట్‌తో ఇంటర్ నేషనల్ లెవల్ యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కిన  బిగ్గెస్ట్ యాక్షన్‌ ఫిల్మ్‌గా వస్తోంది. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడటంతో టాక్ బయటికి వచ్చేసింది. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది. అసలు వాళ్లు సినిమా గురించి ఏమంటున్నారు.. టాక్ ఎలా ఉందో చూద్దాం..

news18-telugu
Updated: August 30, 2019, 7:32 AM IST
Saaho Twitter Review : సాహో ట్విటర్ రివ్యూ.... సినిమా ఎలా ఉందంటే...
సాహో పోస్టర్ Instagram.com/officialsaahomovie
  • Share this:
Saaho Twitter Review : 'బాహుబలి' తరువాత ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సాహో'.. 300 కోట్ల బడ్జెట్‌తో ఇంటర్ నేషనల్ లెవల్ యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కిన  బిగ్గెస్ట్ యాక్షన్‌ ఫిల్మ్‌గా వస్తోంది.  దీంతో సినిమాపై అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీగా అంచనాలు  ఏర్పడ్డాయి. 'సాహో' తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషాల్లో విడుదల అవుతోంది.  మరి అభిమానుల అంచనాలను 'సాహో' సినిమా చేరుకుందా... ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ పడటంతో టాక్ బయటికి వచ్చేసింది. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది.  దర్శకుడు సుజీత్‌ తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సినిమాను ప్రేక్షకుడి ఊహకందని రీతిలో  అదరగొట్టాడని టాక్. అయితే కథ పరంగా ఫస్ట్ ఆఫ్‌లో చెప్పకుండా.. ప్రధాన పాత్రల పరిచయం, గ్రాండ్‌ విజువల్స్‌తో అదరిపోయిందని టాక్‌ వినిపిస్తోంది. అయితే సినిమాలో శ్రద్ధా కపూర్‌ క్యారెక్టర్‌ అనుకున్నంత రేంజ్‌లో లేదన్న టాక్ వినిపిస్తోంది.

ఓవరాల్‌గా ఓవర్సీస్ ఆడియెన్స్ 'సాహో' గురించి చెబుతున్న ప్రకారం.. అసలు మనం చూసింది ఇండియన్ సినిమానా లేదంటే హాలీవుడ్ సినిమానా అనే ఆశ్చర్యంలోకి వెళ్లిపోయారని తెలుస్తుంది. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి బాలీవుడ్‌లో రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఆగస్టు 30న విడుదలౌతోన్న ‘సాహో’ ను సుజీత్‌ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. శ్రద్ధా కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు.



















First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading