ప్రభాస్ ‘సాహో’ వాయిదాకు ఆ రెండు సినిమాలే కారణమా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సాహో’.  ‘బాహుబలి’ సిరీస్  తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీపై టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఐతే.. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు గ్రాఫిక్స్ పనుల కారణంగా ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా ఆగష్టు 30న విడుదల చేయనున్నట్టు ‘సాహో’చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.

news18-telugu
Updated: July 19, 2019, 3:24 PM IST
ప్రభాస్ ‘సాహో’ వాయిదాకు ఆ రెండు సినిమాలే కారణమా..
‘సాహో’సినిమా / Twitter
  • Share this:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సాహో’.  ‘బాహుబలి’ సిరీస్  తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీపై టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఐతే.. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు గ్రాఫిక్స్ పనుల కారణంగా ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా ఆగష్టు 30న విడుదల చేయనున్నట్టు ‘సాహో’చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఐతే.. ‘సాహో’ విడుదల తేది వాయిదా పడటం వెనక వేరే కారణాలున్నాయంటున్నారు. తెలుగు,తమిళం,మలయాళంలో ‘సాహో’ సినిమాకు ఎలాంటి పోటీ లేదు. కానీ బాలీవుడ్ వచ్చే సరికి ఆగష్టు 15న అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘మిషన్ మంగళ్’ తో పాటు.. జాన్ అబ్రహం కథానాయకుడిగా నటించిన ‘బాట్లా హౌస్’ సినిమా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై బాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సాహో’.  ‘బాహుబలి’ సిరీస్  తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీపై టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఐతే.. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు గ్రాఫిక్స్ పనుల కారణంగా ఈ సినిమాను రెండు వారాలు ఆలస్యంగా ఆగష్టు 30న విడుదల చేయనున్నట్టు ‘సాహో’చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.
మిషన్ మంగళ్, బాట్లా హౌస్ దెబ్బకు ‘సాహో’ విడుదల వాయిదాగత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్.. రియలిస్టిక్ స్టోరీలతో భారీ సక్సెస్‌లే అందుకుంటున్నాడు. ఈ రెండు సినిమాలతో పోటీ ఎందుకని అనుకున్నారో ఏమో.. ‘సాహో’ సినిమాను రెండు వారాలు వాయిదా వేసారు.మొత్తానికి పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వర్క్ కారణం అని సాహో ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నా.. బాలీవుడ్ ఇండస్ట్రీతో పోటీ ఎందుకని ‘సాహో’ సినిమా విడుదలను వాయిదా వేయించారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. మొత్తానికి ఆగష్టు 30 థియేటర్స్‌లో విడుదల కాబోతున్న ‘సాహో’ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Published by: Kiran Kumar Thanjavur
First published: July 19, 2019, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading