‘సాహో’ ప్రమోషన్‌లో భాగంగా ఆ హీరోయిన్ కొంగును నోటితో పట్టుకున్న ప్రభాస్..

రవీనా టాండన్ (Twitter/Photo)

Saaho | యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై తెలుగుతో పాటు హిందీ, తమిళంలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రవీనా టాండన్ కొంగు పట్టుకొని ఈ షోలో పెద్ద రచ్చే చేసాడు.

 • Share this:
  యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సాహో’. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై తెలుగుతో పాటు హిందీ, తమిళంలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నెల 30న విడుదల కానున్న ‘సాహో’ సినిమా ప్రమోషన్‌లో వేగం పెంచాడు ప్రభాస్. ఈ సందర్భంగా బాలీవుడ్‌ ఆడియన్స్‌కు ఈ సినిమాను దగ్గర చేయడానికి ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్‌లు పలు టీవీ షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా ప్రభాస్, శ్రద్ధా కపూర్‌లు సల్మాన్ ఖాన్ నిర్మాతగా  ప్రముఖ కథానాయిక రవీనా టాండన్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ‘నచ్ బలియే 9’ డాన్స్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై సల్మాన్ ఖాన్ యాక్ట్ చేసిన ‘కిక్’ సినిమాలోని జుమ్మేకి రాత్ హై పాటకు ప్రభాస్ చిందేశాడు. అంతేకాదు సల్మాన్‌లా ప్రభాస్.. ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేస్తున్న రవీనా టాండన్ కొంగును నోటితో పట్టుకొని స్టెప్పులేశాడు. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  saaho promotion prabhas perform salman dance with senior heroine raveena tandon,prabhas,raveena tandon,prabhas raveena tandon,prabhas dance with raveena tandon,saaho,prabhas saaho,saaho movie,saaho trailer,saaho movie songs,saaho songs,raveena tandon with prabhas,saaho song,prabhas saaho trailer,saaho movie trailer,saaho hindi trailer,prabhas new movie,prabhas new song saaho,prabhas fan of raveena tandon,prabhas about raveena tandon,prabhas and raveena tandon,saaho teaser,prabhas movies,#saaho,saaho enni soni song,saaho movie song,saaho pramotions,bollywood,hindi cinema,ప్రభాస్ సాహో ప్రమోషన్స్,ప్రభాస్ సాహో ప్రమోషన్స్,సాహో ప్రమోషన్స్ ప్రభాస్ రవీనా టాండన్,ప్రభాస్ రవీనా టాండన్,నచ్ బలియే,నచ్ బలియే,టాలీవుడ్,బాలీవుడ్ సినిమా,
  ‘సాహో’ ప్రమోషన్‌లో భాగంగా రవీనా కొంగును పట్టుకున్న ప్రభాస్..(twitter/Photo)


  ‘సాహో’ చిత్ర విషయానికొస్తే.. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్,చుంకీ పాండే,మహేష్ మంజ్రేకర్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్,మురళీ శర్మ, వెన్నెల కిషోర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

   
  First published: