Saaho Pre Release | ‘సాహో’ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సుజిత్

Prabhas Movie Latest news | సుజిత్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా, శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా వస్తున్న సాహో సినిమా ఈనెల 30న విడుదల కానుంది.

news18-telugu
Updated: August 18, 2019, 9:31 PM IST
Saaho Pre Release | ‘సాహో’ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సుజిత్
ప్రభాస్, సుజిత్
news18-telugu
Updated: August 18, 2019, 9:31 PM IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను సాహో దర్శకుడు సుజిత్ ఆకాశానికి ఎత్తేశాడు. బాహుబలిలాంటి సినిమా తర్వాత తనతో సినిమా చేసినా... తనకు కూడా అంతే గౌరవం ఇచ్చేవారని చెప్పారు. సినిమా కోసం రెండేళ్ల పాటు తనకు అండగా నిలిచిన ప్రభాస్‌కు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడాడు. హైదరాబాద్‌లో జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుజిత్ ఎమోషనల్ అయ్యాడు. ప్రభాస్ మైండ్ ఓ 100 టీబీ హార్డ్ డిస్క్ లాంటిదని, ప్రతి విషయం అతడి మైండ్‌లో ఉంటుందని చెప్పాడు. తన షార్ట్ ఫిలింస్ చూసి... స్క్రీన్ ప్లే బాగా చేస్తున్నాడని యూవీ క్రియేషన్స్ నుంచి ప్రభాస్ పిలిపించారని, అయితే, అతి తాను నమ్మలేదని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత ప్రభాస్‌ను కలిస్తే.. అప్పుడు పిలిస్తే ఎందుకు రాలేదని ప్రశ్నించాడని గుర్తు చేసుకున్నాడు. సుజిత్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా, శ్రద్ధ కపూర్ హీరోయిన్‌గా వస్తున్న సాహో సినిమా ఈనెల 30న విడుదల కానుంది.

First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...