Saaho: అజ్ఞాతవాసి బాటలోనే సాహో...ఈ రెండింటికీ లింక్ ఎక్కడ కుదిరిందో తెలుసా...?

Saaho: 2008లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా "లార్గో వించ్‌"కు ఫ్రీమేక్ గా అజ్ఞాతవాసి అపఖ్యాతి మూటగట్టుకోవడమే కాదు. సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచి పవన్ అభిమానులకు పీడకల మిగిల్చింది. అయితే అదే బాటలో...ప్రభాస్ తాజా సినిమా సాహో కూడా కనిపిస్తోందనే టాక్ మొదలైంది.

news18-telugu
Updated: August 30, 2019, 10:42 PM IST
Saaho: అజ్ఞాతవాసి బాటలోనే సాహో...ఈ రెండింటికీ లింక్ ఎక్కడ కుదిరిందో తెలుసా...?
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
Saaho: త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఢమాల్ అయిన చిత్రం అజ్ఞాతవాసి, తాజాగా విడుదలైన సాహో సినిమాకు పోలికలు బాగా ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. అయితే ఈ రెండు సినిమాల కథకు మూలం ఒకటేనని, 2008లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా "లార్గో వించ్‌"కు ఫ్రీమేక్ గా అజ్ఞాతవాసి అపఖ్యాతి మూటగట్టుకోవడమే కాదు. సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచి పవన్ అభిమానులకు పీడకల మిగిల్చింది. అయితే అదే బాటలో...ప్రభాస్ తాజా సినిమా సాహో కూడా కనిపిస్తోందనే టాక్ మొదలైంది. సాహో కథ మూలాలు కూడా ఫ్రెంచ్ చిత్రం "లార్గోవించ్‌"లో కనిపిస్తున్నాయని, అందుకే సాహో అజ్ఞాతవాసి 2.0 అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రెంచ్ సినిమా లార్గోవించ్ లో సైతం రివేంజ్ డ్రామాగా సాగుతుంది. సాహో సైతం దాదాపు ఇదే స్టోరీ లైన్ తో కొంచెం అటూ ఇటూగా ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే లార్గోవించ్ ఫ్రీమేక్ తో త్రివిక్రమ్ టీమ్ చేతులు కాల్చుకోగా, సరిగ్గా ఏడాదిన్నర తర్వాత సుజిత్ టీమ్ సైతం ‘అజ్ఞాతవాసి’ బాటలోనే నడవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.

అయితే విచిత్రం ఏమిటంటే లార్గోవించ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలవగా ఆ సినిమాను ఫాలో అయిన ‘అజ్ఞాతవాసి’, సాహోలకు మాత్రం పీడకలను మిగిల్చింది. గతంలో ‘అజ్ఞాతవాసి’ సినిమాను లార్గోవించ్ ఫ్రెంచ్ డైరక్టర్ జెరోమ్ సాలె థియేటర్‌లో చూసి మరీ తన సినిమాకు ఫ్రీమేక్ చేశారంటూ ట్వీట్ చేశాడు. అయితే ఫ్రెంచ్ మాతృక సినిమా లార్గోవించ్ విజయానికి హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో సాగిపోతుంది. అయితే తెలుగు విషయానికి వచ్చేటప్పటికి హీరో ఇమేజ్ స్క్రీన్ ప్లేకు అడ్డంకిగా మారింది అనేందుకు ‘అజ్ఞాతవాసి’, సాహోలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి.

First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>