Saaho: మహేశ్, పవన్ కళ్యాణ్‌ను వదలని సెంటిమెంట్...ప్రభాస్‌ను పీడిస్తోందా...?

‘సాహో’ (twitter/Photo)

సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు విజయదేవరకొండ వరకూ ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత ఆ సక్సెస్ బాటను కంటిన్యూ చేస్తూ మరో హిట్ కొట్టడం గగనంగా మారింది. అయితే ఈ బ్యాడ్‌లక్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ను కూడా వదల్లేదు.

  • Share this:
    టాలివుడ్‌లో ఒక బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ మరో సినిమా హిట్ కొట్టడం సీనియర్ హీరోలకు పెద్ద తలనొప్పిగా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదలు విజయదేవరకొండ వరకూ ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత ఆ సక్సెస్ బాటను కంటిన్యూ చేస్తూ మరో హిట్ కొట్టడం గగనంగా మారింది. అయితే ఈ బ్యాడ్‌లక్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ను కూడా వదల్లేదు. బాహుబలి లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ ప్రభ ప్రపంచ వ్యాప్తంగా వెలిగిపోయింది. అయితే ఆ లెగసీని కంటిన్యూ చేయాలనే గట్టిపట్టుదలతో మొదలుపెట్టిన సాహో..బ్లాక్ బస్టర్ వద్ద అంతగా ప్రభావం చూపకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. అయితే ఈ సెంటిమెంట్ రాజమౌళి హీరోలు అందరికీ ఉందనే అపప్రథ ఉన్నప్పటికీ, పెద్ద హీరోలు ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత ఆ రేంజ్ ఎక్స్ పెక్టెషన్స్ ను నెక్ట్స్ ప్రాజెక్టులో నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అవుతూనే వస్తున్నారు.

    ఇటీవల చూసుకున్నట్లయితే శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మహేష్ బాబు, ఆ తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి ఢమాల్ ఇచ్చి మరో హిట్ కొట్టేందుకు కొరటాలనే నమ్ముకోవాల్సి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అయితే అత్తారింటికి దారేది తర్వాత హిట్ మొఖం చూడలేదు. సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌లను మూటగట్టుకున్నారు. అయితే ఈ అటు విజయ్ దేవరకొండ సైతం డియర్ కామ్రేడ్ లాంటి డిజాస్టర్ మూటగట్టకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ సైతం బ్లాక్ బస్టర్ తర్వాత డిజాస్టర్ మూటగట్టుకునే బ్యాడ్ సెంటిమెంట్ నుంచి తప్పించుకోలేకపోయాడని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
    First published: