Saaho : ఏ హీరోకు లేని రికార్డ్ సెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్..

Saaho Record : భీమవరం ప్రధాన రహదారిపై కిలోమీటర్ల పొడవునా ప్రభాస్ ఫ్లెక్సీలు,బ్యానర్లే దర్శనమిస్తున్నాయి. దాదాపు 200 అడుగుల భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం.

news18-telugu
Updated: August 30, 2019, 11:08 AM IST
Saaho : ఏ హీరోకు లేని రికార్డ్ సెట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్..
Saaho Record : భీమవరం ప్రధాన రహదారిపై కిలోమీటర్ల పొడవునా ప్రభాస్ ఫ్లెక్సీలు,బ్యానర్లే దర్శనమిస్తున్నాయి. దాదాపు 200 అడుగుల భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం.
  • Share this:
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ 'సాహో' ఫీవర్‌తో ఊగిపోతున్నారు. థియేటర్స్ వద్ద 'జై రెబల్ స్టార్' నినాదాలతో హోరెత్తిస్తున్నారు.సాహో ప్రదర్శించబడుతున్న ప్రతీ థియేటర్ వద్ద అభిమానుల హంగామా పీక్స్‌లో ఉంది.రెండేళ్లుగా సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్..సినిమా విడుదల కావడంతో పండుగ లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.ఇక ప్రభాస్ సొంతూరు భీమవరంలో పరిస్థితి చెప్పనక్కర్లేదు. భీమవరం ప్రధాన రహదారిపై కిలోమీటర్ల పొడవునా ప్రభాస్ ఫ్లెక్సీలు,బ్యానర్లే దర్శనమిస్తున్నాయి.దాదాపు 200 అడుగుల భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం. గతంలో ఏ హీరో ఫ్లెక్సీని ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన దాఖలా లేదు. ప్రభాస్ ఫీవర్‌తో ఊగిపోతున్న భీమవరంను చూసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు.ఏదేమైనా సాహో సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా భారీ ఇమేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ మరో మెట్టు ఎక్కుతుందా.. లేక ఫ్యాన్స్‌ను ఢీలా పడేలా చేస్తుందా? అన్నది వేచి చూడాలి.



First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading